Venkatesh 75: క్లారిటీ వచ్చేసింది!

ABN , First Publish Date - 2023-01-23T13:33:02+05:30 IST

గత ఏడాది ఎఫ్‌3 చిత్రంతో నవ్వులు పూయించిన విక్టరీ వెంకటేశ్‌ ‘ఓరి దేవుడా’ చిత్రంలో అతిథి పాత్రతోనూ మెప్పించారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించి ‘వాట్‌ నెక్ట్స్‌’ అనే మాట ఎక్కువ వినిపిస్తోంది.

Venkatesh 75: క్లారిటీ వచ్చేసింది!

గత ఏడాది ఎఫ్‌3 చిత్రంతో నవ్వులు పూయించిన విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh) ‘ఓరి దేవుడా’ చిత్రంలో అతిథి పాత్రతోనూ మెప్పించారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించి ‘వాట్‌ నెక్ట్స్‌’ అనే మాట ఎక్కువ వినిపిస్తోంది. తదుపరి చిత్రం అంటే వెంకటేశ్‌ హీరోగా నటించే 75వ చిత్రం గురించే టాపిక్‌ అంతా. వెంకీ 75వ చిత్రానికి రూట్‌ క్లియర్‌ అయిందని చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ సినిమా గురించి క్లారిటీ వచ్చింది. (venkatesh 75 clarity) త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌ మీద కెళ్లనుందని, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన 25న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తాడని మొదటి నుంచీ వినిపిస్తోంది. ఇప్పుడు అదే నిజమైంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. నిహారిక ఎంటర్టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ నెల 25న పూర్తి వివరాలు తెలియజేస్తామని ట్విట్టర్‌ వేదికగా నిర్మాణ సంస్థ తెలిపింది. (Venkatesh 75)

‘‘వెంకటేశ్‌గారు హీరోగా 75వ చిత్రం మా సంస్థలో రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకిది ల్యాండ్‌ మార్క్‌ సినిమా’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతుందని, వెంకటేశ్‌ను ఇప్పటి వరకూ ఎవరూ చూపించని కోణంలో దర్శకుడు పాత్రను తీర్చిదిద్దాడని తెలుస్తోంది. శైలేష్‌ కొలను హిట్‌, హిట్‌ 2 చిత్రాలతో విజయం అందుకున్నారు. హిట్‌ 3 కూడా లైన్లో ఉంది. దానికంటే ముందు వెంకీతో ఈ చిత్రం చేస్తారని ఆ తర్వాతే హిట్‌ 3 ఉంటుందని సమాచారం. ఇతర విషయాలు ఈనెల 25న వెల్లడిస్తారు.

Updated Date - 2023-01-23T13:33:03+05:30 IST