సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

SivaRaj kumar 125: ‘వేద’ విడుదల తేదీ ఖరారు!

ABN, First Publish Date - 2023-02-02T17:22:48+05:30

కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌ నటించిన చిత్రం ‘వేద’. కన్నడలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాత వి.ఆర్‌.కృష్ణ మండపాటి ఈ నెల 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌ (sivaraj kumar)నటించిన చిత్రం ‘వేద’(veda). కన్నడలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాత వి.ఆర్‌.కృష్ణ మండపాటి ఈ నెల 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం తెలుగు పోస్టర్‌ను ఫస్ట్‌ గ్లింప్స్‌ను ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని, త్వరలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ భారీగా నిర్వహిస్తాం. మా సినిమాకు అన్ని రకాలుగా సహకరిస్తున్న ప్రభాస్‌కి(Thanks to prabhas) కృతజ్ఞతలు అని నిర్మాత తెలిపారు.

కన్నడలో శివరాజ్‌కుమార్‌ నటించిన 125వ చిత్రమిది. ఆయన భార్య గీత శివరాజ్‌ కుమార్‌ నేతృత్వంలోని తన హోం బ్యానర్‌ అయిన గీతా పిక్చర్స్‌లో వస్తున్న తొలి చిత్రమిది. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్‌ 23న విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే! (veda on 9th feb)

Updated Date - 2023-02-02T17:22:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!