Varun - Lavanya Marriage : వరుణ్‌ - లావణ్యల  పెళ్లి.. ఎలా ప్లాన్  చేశారో తెలుసా?

ABN , First Publish Date - 2023-10-31T11:49:59+05:30 IST

మెగా ఫ్యామిలీ అంతా పెళ్లి సందడిలో మునిగిపోయారు. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ - లావణ్య పెళ్లి ఇటలీలో జరగనుంది. ఇప్పటికే అక్కడికి  చేరుకున్న మెగా కుటుంబం పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. నవంబర్‌ 1న వివాహ వేడుక జరగనుంది. ఇటలీలోని బోర్కో శాన్ ఫెలిస్‌ రిసార్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ ప్లాన్ చేసింది మెగా ఫ్యామిలీ.

Varun - Lavanya Marriage : వరుణ్‌ - లావణ్యల  పెళ్లి.. ఎలా ప్లాన్  చేశారో తెలుసా?

మెగా ఫ్యామిలీ అంతా పెళ్లి సందడిలో మునిగిపోయారు. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ - లావణ్య పెళ్లి ఇటలీలో జరగనుంది. ఇప్పటికే అక్కడికి  చేరుకున్న మెగా కుటుంబం పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. నవంబర్‌ 1న వివాహ వేడుక జరగనుంది. ఇటలీలోని బోర్కో శాన్ ఫెలిస్‌ రిసార్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ ప్లాన్ చేసింది మెగా ఫ్యామిలీ. పెళ్లి ముహూర్తం ఎప్పుడు? ఏ కార్యక్రమం ఎలా ప్లాన్ చేశారనేది.. మూడు రోజుల పెళ్లిలో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి అన్నది ఓ ఇన్విటేషన్లో తెలిపారు. ప్రస్తుతం ఆ ఇన్విటేషన్ నెట్టింట వైరల్‌ అవుతోంది.

VArun (2).jpeg

అక్టోబర్‌ 30, సోమవారం రాత్రి కాక్‌టైల్‌ పార్టీ గ్రాండ్‌గా జరిగింది.

మంగళవారం ఉదయం 11 గంటలకు హల్దీ, పూల్‌ పార్టీ జరగనుంది.

సాయంత్రం 5:30 గంటలకు మెహందీ వేడుక జరగనుంది.

బుధవారం మధ్యాహ్నం 2:48 గంటలకు వరుణ్‌, లావణ్య మెడలో తాళి కట్టనున్నాడు.

అదే రోజు సాయంత్రం 8:30 గంటలకు రిసెప్షన్‌ జరగనుంది.

వరుణ్‌వారి పెళ్లి పార్టీ పేరుతో ఓ టూరిస్ట్‌ బస్‌ కూడా ఏర్పాటు చేశారు. నితిన ఆ బస్‌ ఫొటోను ఇనస్టాలో షేర్‌ చేశారు.

అయితే పెళ్లి మూడు రోజులు కార్యక్రమానికి తగ్గట్టుగా ధరించే దుస్తుల వివరాలను కూడా కార్డులో వెల్లడించారు.

Wedding-varun.jpg

కాక్‌టైల్‌ : బ్లాక్‌ టై

రిసెప్షన్ : గ్లిట్జ్‌ అండ్‌ గ్లామ్‌

హల్దీ విల్‌ పూల్‌ పార్టీ : ఎల్లో, వైట్‌, పింక్‌

మెహందీ : వైబ్రెంట్‌ కలర్స్‌

మ్యారేజ్‌ ఎటైర్‌: పాస్టెల్‌

VArun (4).jpeg

ఈ వివాహ వేడుకకు మెగా కుటుంబం, లావణ్య కుటుంబ సభ్యులతోపాటు సన్నిహితులు, శ్రేయోభిలాషులు కలిపి మొత్తం 120 మంది ఈ వేడుకలో పాల్గొనున్నారు. ఇప్పటికే నితిన వంటి స్నేహితులు కూడా ఇటలీకి చేరుకున్నారు. నవంబరు 5న హైదరాబాద్‌లోని N -కన్వెన్షన్ సెంటర్‌లో జరగబోయే గ్రాండ్‌ రిసెప్షన్‌కు సినీ -రాజకీయ ప్రముఖులు హాజరవుతారు.

nithin.jpg

VArun (1).jpeg

Updated Date - 2023-10-31T12:36:17+05:30 IST