Operation Valentine: వ‌రుణ్‌తేజ్‌.. ఆప‌రేష‌న్ వాలంటైన్ వ‌చ్చేశాడు

ABN , Publish Date - Dec 18 , 2023 | 08:31 PM

గాంఢీవ‌ధారి సినిమా త‌ర్వాత వ‌రుణ్ తేజ్ తాజాగా న‌టించిన చిత్రం ఆప‌రేష‌న్ వాలంటైన్ . శక్తి ప్రతాప్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం టీజ‌ర్‌ను ఈరోజు (సోమ‌వారం) విడుద‌ల చేశారు.

Operation Valentine: వ‌రుణ్‌తేజ్‌.. ఆప‌రేష‌న్ వాలంటైన్ వ‌చ్చేశాడు
Operation Valentine

గాంఢీవ‌ధారి సినిమా త‌ర్వాత వ‌రుణ్ తేజ్ తాజాగా న‌టించిన చిత్రం ఆప‌రేష‌న్ వాలంటైన్ (Operation Valentine). శక్తి ప్రతాప్ సింగ్ (Shakti Pratap Singh Hada) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మాజీ మిస్ వ‌ర‌ల్డ్ మానుషీ చిల్ల‌ర్ (Manushi Chhillar) క‌థానాయిక‌గా న‌టిస్తున్న‌ది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు స‌న్న‌ద్ద‌మ‌వుతున్న‌ది. ఈ క్ర‌మంలో ఈరోజు (సోమ‌వారం) టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.


ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్, మానుషి చిల్ల‌ర్‌లు ఎయుర్‌ఫోర్స్ ఆఫీస‌ర్లుగా న‌టిస్తున్నారు. నిజ జీవితంలో వాస్త‌వంగా జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా శ‌త్రు దేశాల‌పై ఎయిర్ స్ట్రైక్స్ చేసిన‌క‌థ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. మొద‌ట ఈ సినిమాను డిసెంబ‌ర్‌8న విడుద‌ల చేయాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ వ‌రుణ్‌(Varun Tej Konidela), లావ‌ణ్య‌ల వివాహం త‌దిత‌ర కార‌ణాల‌తో సినిమా వాయిదా ప‌డింది. 2024 ఫిభ్ర‌వ‌రి 16న విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. సోని ఇండియా(Sony Pics India) సంస్థ‌ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయ‌ర్ (MickeyJMeyer) సంగీతం అందించారు.

Updated Date - Dec 18 , 2023 | 08:31 PM