Varun Tej - Lavanya Tripati : శుభలేఖ వైరల్‌.. కార్డు ప్రత్యేకత ఏంటంటే..!

ABN , First Publish Date - 2023-10-26T21:49:11+05:30 IST

మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. వరుణ్‌తేజ్‌ (varun Tej)- లావణ్యా త్రిపాఠీ (lavanya tripati) వివాహబంధంతో ఒకటి కానున్నారు. ఇటీవల ఎంగేజ్‌మెంట్‌ కూడా పూర్తయింది. ఇప్పటికే బ్యాచ్ లర్  పార్టీలు షురూ అయిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం వరుణ్‌- లావణ్య పెళ్లి శుభలేఖ నెట్టింట వైరల్‌గా మారుతుంది.

Varun Tej - Lavanya Tripati : శుభలేఖ వైరల్‌.. కార్డు ప్రత్యేకత ఏంటంటే..!

మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. వరుణ్‌తేజ్‌ (varun Tej)- లావణ్యా త్రిపాఠీ (lavanya tripati) వివాహబంధంతో ఒకటి కానున్నారు. ఇటీవల ఎంగేజ్‌మెంట్‌ కూడా పూర్తయింది. ఇప్పటికే బ్యాచ్ లర్  పార్టీలు షురూ అయిన సంగతి తెలిసిందే! అయితే వీరిద్దరి పెళ్లి ఇండియాలో కాకుండా ఇటలీలో జరగనుంది. ఇప్పటికే ఆ పెళ్లి పనులు మొదలయ్యాయి. ప్రీ వెడ్డింగ్‌ పార్టీస్‌, ఫోటోషూట్స్‌, షాపింగ్‌ పూర్తయ్యాయి. నవంబర్‌ 1 న ఇటలీలోని టుస్కానీలో పెళ్లి ఘనంగా జరగనుంది. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కావడంతో అక్కడకు కేవలం ఇరు వర్గాల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. తర్వాత హైదరాబాద్‌ లో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు. (Invitation Viral)

ప్రస్తుతం వరుణ్‌- లావణ్య పెళ్లి శుభలేఖ నెట్టింట వైరల్‌గా మారుతుంది. వరుణ్‌, లావణ్య.. ఇద్దరి పేర్లలోని తొలి అక్షరాలు కార్డు పైభాగంలో డిజైన చేశారు. కార్డు లోపల వరుణ్‌ నానమ్మ-తాతయ్యల పేర్లు పెట్టారు. అందులో నవంబర్‌ 1 న ఇటలీలో పెళ్లి జరగనుంది. నవంబర్‌ 5 న హైదరాబాద్‌ లోని ఎన కన్వెన్షన్‌లో రిస్పెషన్‌ ఉండనుంది అని పేర్కొన్నారు. ఉపాసన ఈ పెళ్లి పనులన్నీ దగ్గరుండి చేసుకుంటుందని సమాచారం. మిస్టర్‌ సినిమా సమయంలో ప్రేమలో పడ్డ వీరిద్దరూ కొన్నేళ్ల ప్రేమ తర్వాత ఇరుకుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటలెక్కనున్నారు.

Updated Date - 2023-10-26T21:49:11+05:30 IST