సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Varun Sandesh: ఏంటి అలా అయిపోయాడు పాపం!

ABN, First Publish Date - 2023-03-09T17:23:44+05:30

వరుణ్ సందేశ్ (Varun Sandesh) మెల్ల మెల్లగా తెలుగు సినిమాల్లో పుంజుకుంటున్నాడు. ఇప్పుడు అతను కథానాయకుడిగా ధనరాజ్ (Dhanraj), కాశీ విశ్వనాధ్ (Kasi Viswanath) ప్రధాన పాత్రలలో ఒక సినిమా వస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరుణ్ సందేశ్ (Varun Sandesh) మెల్ల మెల్లగా తెలుగు సినిమాల్లో పుంజుకుంటున్నాడు. ఇప్పుడు అతను కథానాయకుడిగా ధనరాజ్ (Dhanraj), కాశీ విశ్వనాధ్ (Kasi Viswanath) ప్రధాన పాత్రలలో ఒక సినిమా వస్తోంది. దీనికి ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్, అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు. ఈ సినిమాకి ‘చిత్రం చూడర’ (Chitram Choodara) అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో వరుణ్ సందేశ్, ధనరాజ్, కాశీ విశ్వనాధ్ లు పోలీస్ స్టేషన్ లో తప్పు చేసి పట్టుబడిన నిందితులుగా కూర్చోవడం కొంచెం క్యురియాసిటీని పెంచుతోంది.

ఈమధ్య విడుదల అయిన 'మైఖేల్' (Michael) సినిమాలో వరుణ్ సందేశ్ ని ఒక వైవిధ్యమయిన విలన్ పాత్రలో చూసాం కాదా. ఇప్పుడు ఈ 'చిత్రం చూడరా' లో వరుణ్ సందేశ్ మళ్ళీ కథానాయకుడిగా రంగ ప్రవేశం చేస్తున్నాడు అనిపిస్తోంది. అయితే వరుణ్ ఇలా అన్ని పాత్రలు వైవిధ్యంగా మంచి సినిమాలు చేసుకుంటూ పోతే, మంచి మంచి పాత్రలు వచ్చే అవకాశం కూడా వుంది అని పరిశ్రమలో ఒక టాక్.

అలాగే ఈ 'చిత్రం చూడర' సినిమాలో ఇంకా అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, లాంటి నటులు వున్నారు, కాగా శీతల్ భట్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా 'నేనింతే' ఫేం అదితి గౌతమ్ స్పెషల్ సాంగ్ లో కనిపించే నుండి అని ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2023-03-09T17:43:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!