RGV: పేమెంట్ ఇస్తే చాలు, వర్మ ఎటువంటి దుష్ప్రచారం అయినా చేస్తారు, సంచలన నిజాలు బయటపెట్టిన వర్మ అసిస్టెంట్

ABN , First Publish Date - 2023-06-14T10:46:25+05:30 IST

ఈమధ్య వర్మ ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి అందులో అధికార వైస్సార్సీపీ పార్టీ కి బాకా ఊదుతున్నాడు. అలాగే అతను రాజకీయ నేపథ్యంలో కొందరిని టార్గెట్ చేస్తూ 'వ్యూహం' అని ఇంకో సినిమా తీస్తున్నాడు. వీటన్నిటి వెనక వున్న అసలు నిజాలని బయట పెట్టిన వర్మ అసిస్టెంట్ దర్శకుడు

RGV: పేమెంట్ ఇస్తే చాలు, వర్మ ఎటువంటి దుష్ప్రచారం అయినా చేస్తారు, సంచలన నిజాలు బయటపెట్టిన వర్మ అసిస్టెంట్
Ram Gopal Varma

రామ్ గోపాల్ వర్మ (RamGopalVarma) ఎప్పుడూ వార్తల్లో వుండే వ్యక్తి. ఈమధ్య ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) లో ప్రస్తుతం వున్న అధికార పార్టీ వైస్సార్సీపీకి (YSRCP) అందులో బాకా ఊదుతున్నాడు. అలాగే ఇప్పుడు డెన్ (DEN) అని ఒక కొత్త ఆఫీస్ కూడా ఓపెన్ చేసి మీడియా వాళ్ళకి అది చూపిస్తూ వున్నాడు. అయితే వర్మ ఒక మంచి సినిమా, లేదా ఒక ప్రోపర్ సినిమా తీసి చాలా సంవత్సరాలు అవుతోంది. తెలుగు దేశం పార్టీ (TeluguDesamParty), ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (ChandrababuNaidu), అతని కుమారుడు లోకేష్ (Lokesh) వీళ్ళని టార్గెట్, లేదా డేమేజ్ చేసే విధంగా వర్మ ఎప్పుడూ సినిమాలు తీస్తూ ఉంటాడు. అయితే వైస్సార్సీపీ వాళ్ళు వర్మకి వెనకాల ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నారు అన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా, అది వర్మ ఓపెన్ గా ఒప్పుకోడు.

rgvchikotipraveen1.jpg

అయితే ఇప్పుడు వర్మ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ దర్శకుడు గార్లపాటి వెంకటేష్ (GarlapatiVenkatesh) వర్మ గురించి కొన్ని సంచలన విజయాలు బయటపెట్టాడు. అందులో వర్మకి సుమారు రూ 20 కోట్ల వరకు అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చడానికి అతను ఎటువంటి పనైనా చేస్తాడు #RGV అని వెంకటేష్ చెప్పాడు. అందువల్లనే అప్ప్పట్లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' (Lakshmis NTR) సినిమా తీసాడని కూడా చెప్పాడు. పే మెంట్ అతనికి ముఖ్యమని, దానికోసం అందులో నిజాలు లేకపోయినా ఎటువంటి దుష్ప్రచారానికైనా వర్మ సిద్ధం అని వెంకటేష్ చెప్పాడు. అయితే ఇప్పుడు తాను వర్మ దగ్గర పని చెయ్యడం లేదని, ఇద్దరి మధ్య కొన్ని పొరపచ్చాలు వచ్చాయని అందువల్ల వర్మ దగ్గర మానేసాను అని చెప్పుకొచ్చాడు వెంకటేష్.

అలాగే వైస్సార్సీపీ వ్యక్తి వచ్చి వర్మ గారితో డీల్స్ మాట్లాడుకోవటం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా అప్పుడు చూసాను అని కూడా చెప్పాడు వెంకటేష్. ఇప్పుడు మళ్ళీ అదే విషప్రచారం చేస్తున్నాడు అని చెప్పాడు. అతనికి పే మెంట్ ఇస్తే చాలు అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రయత్నం, అదే విషప్రయోగం చేస్తున్నాడు అని చెప్పారు. ఇప్పుడు తీయబోయే సినిమాలో, జగన్ గారు (YSJagan), భారతి గారు (YSBharathi), చంద్రబాబునాయుడు (ChandrababuNaidu) గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ (PawanKalyan), కొడాలి నాని (KodaliNani) ఇలా అందరి పాత్రలు వుంటాయని చెప్పాడు వెంకటేష్.

ఇదంతా తప్పుడు ప్రచారం అని, కేవలం డబ్బులు కోసమే చేస్తున్నాడు అని అంటాడు. చాలామంది వర్మ క్రియేటివ్ దర్శకుడు అనుకుంటారు అని, దగ్గరగా చూస్తే అతను పెద్ద దర్శకుడు కాదని, పే మెంట్ కోసం ఏదైనా చేస్తాడు అని చెప్పాడు. ఒకప్పుడు వర్మ గారు అంటే ఎలా ఉండేదని, ఇప్పుడు అలా లేదని చెప్పాడు వెంకటేష్.

Updated Date - 2023-06-14T10:46:25+05:30 IST