Adi Kesava : సిత్రావతి.. అందాన్ని పొగుడుతూ...

ABN , First Publish Date - 2023-09-09T11:40:46+05:30 IST

పంజా వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదికేశవ’. శ్రీలీల కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంతో అపర్ణా దాస్‌, జోజు జార్జ్‌ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకంపైౖ సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Adi Kesava : సిత్రావతి.. అందాన్ని పొగుడుతూ...

పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja vaishnav tej) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదికేశవ’ (Adi kesava). శ్రీలీల కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంతో అపర్ణా దాస్‌, జోజు జార్జ్‌ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకంపైౖ సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంతో శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘సిత్తరాల సిత్రావతి’ అంటూ సాగే పాటను శనివారం చిత్ర బృందం విడుదల చేసింది. హీరోహీరోయిన్ల మధ్య సాగే మెలోడీ సాంగ్‌ ఇది. హీరో హీరోయిన్‌ను ‘సిత్తరాల సిత్రావతి’ అని పిలుస్తూ, ఆమె అందాన్ని పొగుడుతూ పాడే పాట ఇది. రామజోగయ్య శాస్ర్తి సాహిత్యం అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, గాయని రమ్య బెహరా ఆలపించారు. పార్టీల్లో ఈ పాట మార్మోగనుందని చిత్ర బృందం చెబుతోంది. పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి నవీన్‌ నూలి ఎడిటర్‌గా, డడ్లీ, ఆర్థర్‌ ఎ. విల్సన్‌ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు.

Updated Date - 2023-09-09T11:40:46+05:30 IST