Ustaad BhagatSingh : సేవియర్‌ విత్‌ స్టైల్‌ అండ్‌ స్వాగ్‌

ABN , First Publish Date - 2023-05-11T13:04:42+05:30 IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ - దర్శకుడు హరీశ్‌ శంకర్‌ల కెరీర్‌లో ఈ రోజుకో ప్రత్యేకత ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రం విడుదలై నేటికి 11 ఏళ్లు పూర్తయింది.

Ustaad BhagatSingh : సేవియర్‌ విత్‌ స్టైల్‌ అండ్‌ స్వాగ్‌

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) - దర్శకుడు హరీశ్‌ శంకర్‌ల (Harish shankar) కెరీర్‌లో ఈ రోజుకో ప్రత్యేకత ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌’ (Gabbar singh 11 years) చిత్రం విడుదలై నేటికి 11 ఏళ్లు పూర్తయింది. పదేళ్ల తర్వాత పవన్‌కు భారీ విజయాన్ని అందించిన చిత్రమిది. దర్శకుడిగా ఓ పెద్ద హీరోతో సినిమా అవకాశం అందుకుని బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టడం ఓ విశేషం. మళ్లీ 11 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌ సెట్‌ అయింది. తాజాగా పవన్‌కల్యాణ్‌ - హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రం తెరకెక్కుతోంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్‌సింగ్‌’ విడుదలై 11 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ను సర్‌ప్రైజ్‌ అభిమానులకు అందించనున్నారు. గురువారం సాయంత్రం 4.59 నిమిషాలకు గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు. దాని కన్నా ముందు అభిమానుల ఎగ్జైట్‌మెంట్‌ రెట్టింపు చేయడానికి ‘ఎ సేవియర్‌ విత్‌ స్టైల్‌ అండ్‌ స్వాగ్‌’, వి కాల్‌ మిమ్‌ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ అంటూ పవన్‌కల్యాణ్‌ కొత్త లుక్‌ను విడుదల చేశారు. రోడ్డుపై బారీగేట్‌పై చెయ్యి వేసి ఎవరికో వార్నింగ్‌ ఇస్తునట్లుగా ఉన్న పవన్‌ లుక్‌ అదిరింది. ప్రస్తుతం ఈ లుక్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. నేటి సాయంత్రం విడుదల కానున్న గ్లింప్స్‌ కోసం అభిమాన లోకం ఎంతగానో ఎదురుచూస్తోంది. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక. మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. (saviour with style and swag)

Updated Date - 2023-05-11T13:04:42+05:30 IST