Ustaad bhagat singh: ఆగిపోలేదు.. చిన్న గ్యాప్‌ అంతే!

ABN , First Publish Date - 2023-08-08T14:40:08+05:30 IST

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో మొదలైన ‘ఉస్తాత్‌ భగత్‌సింగ్‌’ చిత్రం ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే! పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రలో బిజీ కావడం వల్ల తదుపరి షెడ్యూల్‌ కాస్త ఆలస్యమైన సంగతి తెలిసిందే. దీంతో సినిమా ఆగిపోయిందనే కామెంట్లు వస్తున్న నేపథ్యంలో నిర్మాత నవీన్‌ క్లారిటీ ఇచ్చారు.

Ustaad bhagat singh: ఆగిపోలేదు.. చిన్న గ్యాప్‌ అంతే!

పవన్‌ కళ్యాణ్‌ (Pawan kalyan) హీరోగా హరీశ్‌ శంకర్‌ (harish shankar) దర్శకత్వంలో మొదలైన ‘ఉస్తాత్‌ భగత్‌సింగ్‌’ (Ustaad bhagat singh)చిత్రం ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే! పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రలో బిజీ కావడం వల్ల తదుపరి షెడ్యూల్‌ కాస్త ఆలస్యమైన సంగతి తెలిసిందే. దీంతో సినిమా ఆగిపోయిందనే కామెంట్లు వస్తున్న నేపథ్యంలో నిర్మాత నవీన్‌ క్లారిటీ ఇచ్చారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 డేస్‌ సెలబ్రేషన్స్‌ వేదికగా ఆయన మాట్లాడారు. ఈ చిత్రం ఆగిపోలేదని, త్వరలో తాజా షెడ్యూల్‌ మొదలవుతుందని తెలిపారు. విడుదల గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.

వచ్చే ఏడాది సంక్రాంతి, లేదా వేసవిలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నామని చెప్పారు. దీంతో సినిమాపై వస్తున్న రూమర్స్‌కు చెక్‌ పడింది. పవన్‌కల్యాణ్‌ సరసన శ్రీలీలా కథానాయికగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-08-08T15:01:43+05:30 IST