కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan kalyan : కీలక భాగం పూర్తి.. ఎప్పటిలాగే పవర్‌స్టార్‌ ఇరగదీశారు!

ABN, First Publish Date - 2023-10-01T11:16:53+05:30

పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan), హరీశ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వంలో 11 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం 'ఉస్తాద్‌ భగత సింగ్‌’.Ustaad Bhagat singh) మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇటీవల కొత్త షెడ్యూల్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Pawan kalyan :  కీలక భాగం పూర్తి.. ఎప్పటిలాగే పవర్‌స్టార్‌ ఇరగదీశారు!

పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan), హరీశ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వంలో 11 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం 'ఉస్తాద్‌ భగత సింగ్‌’.Ustaad Bhagat singh) మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇటీవల కొత్త షెడ్యూల్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్‌లో పవనకల్యాణ్‌పై పవర్‌ ప్యాక్డ్‌ సీన్స్  చిత్రీకరించారు. ఈ విషయం గురించి దర్శకుడు హరీశ శంకర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’లోని అత్యంత ముఖ్యమైన భాగం చిత్రీకరణ పూర్తయ్యింది. పవన్‌ కల్యాణ్‌ ఎప్పటిలాగే పవర్‌ఫుల్‌గా నటించారు’’ అని ఆయన పేర్కొన్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్థమవుతున్న ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు.

పవన మరోవైపు ఓజీ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. నాలుగో విడత వారాహి విజయ యాత్ర పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేస్తారని తెలుస్తోంది. సుజీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-10-01T11:16:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!