Ugly story: రొమాంటిక్, ఇంటెన్సిఫైడ్ థ్రిల్లర్‌

ABN , Publish Date - Dec 25 , 2023 | 05:46 PM

నందు, అవికా గోర్ హీరో హీరోయిన్లు  లక్కీ మీడియా, రియాజియా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'అగ్లీ స్టోరీ.  ప్రణవ స్వరూప్ దర్శకుడు.  ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ఇటీవల విడుదలై  ఆకట్టుకుంటోంది.

Ugly story:  రొమాంటిక్, ఇంటెన్సిఫైడ్ థ్రిల్లర్‌

నందు(Nandu) అవికా గోర్ (Avika gor) హీరో హీరోయిన్లు  లక్కీ మీడియా, రియాజియా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'అగ్లీ స్టోరీ (Ugly story).  ప్రణవ స్వరూప్ దర్శకుడు.  ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ఇటీవల విడుదలై  ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకుడు ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ "అగ్లీ స్టోరీ మూవీతో 2024 హిట్టు కొట్టబోతున్నాము. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్ గారు, సుభాషిని గారు, కొండా లక్ష్మణ్ గారు నన్ను నా కథను నమ్మి ఈ సినిమాని నిర్మించారు.  గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ చాలా మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీజర్ క్లైమాక్స్ లో నందు చెప్పిన డైలాగ్ ఇమేజినేషన్లో ఉన్న ప్రేమ రియల్ లైఫ్ లో ఉండదు అనే డైలాగ్ కి చాలా మంచి స్పందన లభిస్తోంది. ఇలాంటి డైలాగులు యూత్ ని ఆకట్టుకునే విధంగా ఇంకా ఎన్నో ఉండబోతున్నాయి. ఈ గ్లింప్స్ ఇచ్చిన రెస్పాన్స్ తో ముందు ముందు వచ్చే టీజర్ ట్రైలర్ మరియు సినిమాని ఇంకా చాలా కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్తున్నాము. అతి త్వరలో టీజర్, ట్రైలర్ విడుదల చేస్తాం'' అని  అన్నారు. 

Updated Date - Dec 25 , 2023 | 05:46 PM