సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pawan kalyan-SDT: రెండు టైటిళ్లు... ఏది ఫిక్స్‌ చేస్తారో?

ABN, First Publish Date - 2023-04-30T10:43:01+05:30

పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) - సాయిధరమ్‌ (Saidharam tej)తేజ్‌ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే! తమిళ హిట్‌ చిత్రం ‘వినోదాయ శీతం’ (Vinodaaya Setham Remake) చిత్రానికి రీమేక్‌ ఇది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) - సాయిధరమ్‌ (Saidharam tej)తేజ్‌ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే! తమిళ హిట్‌ చిత్రం ‘వినోదాయ శీతం’ (Vinodaaya Setham Remake) చిత్రానికి రీమేక్‌ ఇది. సముద్రఖని (Samudrakhani)దర్శకుడు. ఇప్పటికే టాకీ పార్ట్‌ పూర్తయింది. ఇటీవల హైదరాబాద్‌లో పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. వచ్చేవారంలో ఓ పాటను చిత్రీకరిస్తారు. ఫాంటసీ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ నిర్ణయించలేదు. ఇప్పుడు సోషల్‌ మీడియా మొత్తం ఇదే చర్చ. అయితే ఈ సినిమాకు కొన్ని టైటిళ్లు అనుకుంటునట్లు పేర్లు బయటికొచ్చాయి. అందులో ‘దేవర’ (Devara)ఒకటి. ఈ చిత్రానికి ఇదే టైటిల్‌ ఫిక్స్‌ చేస్తారని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. తాజాగా మరో టైటిల్‌ బయటకొచ్చింది. అదే... ‘దేవుడే దిగి వచ్చినా’. దేవుడికీ, మనిషికీ మధ్య నడిచే కథ ఇది. కథలో కీలక సన్నివేశాలన్నీ వారి ఇద్దరి మఽధ్యే నడుస్తాయట. అందుకే దేవుడిని స్పురించేలా ఓ టైటిల్‌ పెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకే ‘దేవుడే దిగీ వచ్చినా’ (Devude Digi vachina) అనే పేరు ఖరారు చేశారని సమాచారం. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ స్ర్కీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారని టాక్‌! ఈ టైటిల్‌ కూడా ఆయనే సూచించారని తెలుస్తోంది. ఈ వారంలో టైటిల్‌ ప్రకటించే అవకాశం ఉంది. (PKSDT)

ఇటీవల ఈ టైటిల్‌ గురించి జబర్దస్త్‌ కమెడియన్‌, పవన్‌కల్యాణ్‌ అభిమాని అయిన హైపర్‌ ఆది ‘దేవుడే దిగి వచ్చినా’? అంటూ పవన్‌కల్యాణ్‌, పికెఎస్‌డిటి టైటిల్‌ను ట్యాగ్‌ చేశారు. అప్పటి నుంచే ఈ టైటిల్‌ గురించి చర్చ మొదలైంది. అభిమానులు అయితే పవన్‌కు ఈ టైటిల్‌ కరెక్ట్‌గా సూటవుతుందని ఇదే టైటిల్‌ ఖాయం చేయమని సూచించారు. మరి ఏ టైటిల్‌ ఫైనల్‌ చేస్తారో చూడాలి. జూలై 28న ఈ చిత్రం విడుదల కానుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-04-30T10:43:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!