RashmiGautam: నన్ను ట్రోల్ చెయ్యడం సరి కాదు

ABN , First Publish Date - 2023-02-23T16:54:06+05:30 IST

ప్రముఖ నటి, యాంకర్ రష్మీ గౌతమ్ ఎప్పుడూ వీధి కుక్కల (#streetdogs) గురించి తన సాంఘీక మాధ్యమం ద్వారా చాలా ఫైట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆమె స్వయంగా ఆమెకి వీలయినంతగా ఈ వీధి కుక్కలకి (#straydogs) ఆహారం కూడా అందించేది. అయితే ఇప్పుడు ఈ బాబుని వీధి కుక్కలు చంపేయటం తో అందరూ రష్మీ గౌతమ్ ని ట్రోల్ చేస్తున్నారు.

RashmiGautam: నన్ను ట్రోల్ చెయ్యడం సరి కాదు

వీధి కుక్కలు (#streetdogs) కొన్ని రోజుల కిందట ఒక బాలుడిని చాలా అమానుషంగా చంపేసిన వీడియో చాలామంది ప్రజలను కలచివేసింది. ఈ వీధి కుక్కల (#StrayDogs) సమస్య ఇప్పుడు ఒక పెద్ద టాపిక్ గా తయారయింది, ప్రభుతం మీద కూడా చాలా ఒత్తిడి వుంది వాటి మీద ఈదిన చర్య తీసుకోవాలని. దాదాపు కొన్ని వందల, వేలల్లో వుండే ఈ వీధి కుక్కలను ఎలా కంట్రోల్ చెయ్యాలి, ఏమి చెయ్యాలి అనే విషయం మీద ఇప్పుడు ప్రభుతం మీద ఒత్తిడి తీసుకు రావాలి. ఆలా చెయ్యకుండా, సాంఘీక మాధ్యమాల్లో యానిమల్ యాక్టివిస్ట్, లేదా యానిమల్ లవర్ అయిన రష్మీ గౌతమ్ (#RashmiGautam) మీద పడితే ఏమి లాభం.

rashmi-gautam2.jpg

ప్రముఖ నటి, యాంకర్ రష్మీ గౌతమ్ ఎప్పుడూ వీధి కుక్కల (#streetdogs) గురించి తన సాంఘీక మాధ్యమం ద్వారా చాలా ఫైట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆమె స్వయంగా ఆమెకి వీలయినంతగా ఈ వీధి కుక్కలకి (#straydogs) ఆహారం కూడా అందించేది. అయితే ఇప్పుడు ఈ బాబుని వీధి కుక్కలు చంపేయటం తో అందరూ రష్మీ గౌతమ్ ని ట్రోల్ చేస్తున్నారు. ఆమె పెట్ లవర్, యాక్టివిస్ట్ అయినంత మాత్రాన, ఆమెని ట్రోల్ చేస్తే ఈ సమస్య సమసిపోదు కదా. (#straydogs)

సాంఘీక మాధ్యమం లో రష్మీ గౌతమ్ ని అందరూ ట్రోల్ చేస్తుంటే, ఆమె వీలయినంత నెమ్మదత్వం తో అందరికి సమాధానాలు చెప్తోంది. అయితే ఆ బాలుడిని వీధి కుక్కలు హతమార్చిన దగ్గర నుంచీ ఆమెని ట్రోల్ చేస్తూనే వున్నారు. ఆమె కూడా వీళ్ళందరికీ సరి అయినా సమాధానం చెపుతూ, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, నన్ను ట్రోల్ చేస్తే సమస్య సమసిపోదు అని చెప్తోంది. ఇప్పుడు కుక్కలతో ఒక్కటే కాదు వాటితో పాటు, ఆవులు కూడా వీధుల్లో తిరుగుతున్నాయి, ఇవి కూడా పర్యావరణం లో భాగమే కదా అని చెప్తోంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏ దిశగా వస్తుందో తెలియదు కానీ, ఆమె మీద ట్రోలింగ్ మాత్రం ఆగటం లేదు.

rashmi-gautam3.jpg

"ఆ చిన్న బాబు కి ఏమి జరిగింది అనే విషయం నిజంగా విచారకరం. అటువంటి స్ట్రీట్ డాగ్స్ ని ఎలా కంట్రోల్ చెయ్యాలి అన్న విషయం మీద నన్ను ట్రోల్ చేయడం సరి కాదు. ఆ చిన్న బాబు జీవితాన్ని తిరిగి తీసుకురాలేము, కానీ ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలి. వీధి జంతువులు అందులో విచ్చలవిడి ఆవులు కూడా ఇప్పుడు మన పట్టణ పర్యావరణ వ్యవస్థలో భాగం అయ్యాయి, (Sic)" అని చెప్పింది రష్మీ ట్విట్టర్ లో.

"కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మీ వీధిలో వుండే కుక్కలకు స్టెరిలైజ్/వ్యాక్సినేషన్ చేయమని మీ స్థానిక మున్సిపల్ బాడీలకు తెలియజేయండి. దేశవ్యాప్తంగా 8 కోట్ల కుక్కలను షెల్టర్లలో పెట్టడం కుదరదు, ఇది ఆచరణాత్మకంగా అసాధ్యం. మనలాగే జంతువులు కూడా నొప్పిని మరియు ఆకలిని అనుభవిస్తాయి. మనం ఎలా అశాంతిగా ఉంటామో అవి కూడా అలాగే ఉంటాయి, (sic)" అని కూడా చెప్పింది రష్మీ. కానీ ఆమె మీద ట్రోలింగ్ మాత్రం ఆగటం లేదు.

rashmi-gautam4.jpg

అయితే ఈ టాపిక్ అక్కడైతే ఆగిపోకుండా ఇంకా వీధి పందులు, వీధుల్లో తిరుగుతున్న ఆవులు ఇలా అన్నిటిమీదకి మళ్లింది. రష్మీ వీటి గురించి కూడా మాట్లాడుతోంది, వీటన్నిటికీ పరిష్కారం ఆలోచించాలి, కానీ ఒక సంఘటన జరిగింది అని వాటన్నిటినీ చంపేయలేము కదా అని వాదిస్తోంది.

Updated Date - 2023-02-23T16:54:07+05:30 IST