TrishaKrishnan: 'పీఎస్ 2' తరువాత త్రిష చేయబోయేది ఇదే !

ABN , First Publish Date - 2023-04-23T17:24:16+05:30 IST

పీస్ 2 తరువాత, త్రిష ఎటువంటి ప్రాజెక్ట్ వస్తోంది అని అందరికి కుతూహలంగా ఉంటే, ఆసక్తికరం ఏంటంటే ఆమె మొదటి సారిగా ఒక వెబ్ సిరీస్ చేసింది. అందులో త్రిష ఎటువంటి పాత్ర చేస్తోందో తెలుసా...

TrishaKrishnan: 'పీఎస్ 2' తరువాత త్రిష చేయబోయేది ఇదే !

త్రిష (Trisha) దక్షిణ భారతదేశ సినిమాలో ఇప్పటికీ అగ్రతారగా వెలుగుతున్న నటి. 20 ఏళ్లకు పైబడి సినిమా రంగంలో ఉంటూ ఇంకా అగ్ర తారగా ఉండటం అంత సులువైన విషయం కాదు. కానీ త్రిష ఆలా కంటిన్యూ గా సినిమాలు చేస్తూ మొదట్లో ఎలా వుందో అంతే గ్లామర్ గానే ఇప్పుడు కూడా వుంది. మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహించిన 'పీస్ 2' (Ponniyan Selvan 2) రానున్న శుక్రవారం విడుదల అవుతోంది. ఇది 'పీస్ 1' (Ponniyan Selvan 1) కి రెండో పార్ట్ గా వస్తోంది. ఇందులో త్రిష (Trisha) ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తుంది.

trishakrishnan3.jpg

ఇదిలా ఉంటే త్రిష, లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) విజయ్ (Vijay) కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా కథానాయికగా నటిస్తోంది. అయితే ఆమె 'పీస్ 2' తరువాత ఎటువంటి సినిమా విడుదల అవుతుంది అని ఆమె అభిమానులకు సందేహం వుంది. కానీ త్రిష మొదటిసారిగా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది, ఆ వెబ్ సిరీస్ టైటిల్ 'బృంద' (#Brinda). దీనికి తెలుగు దర్శకుడు సూర్య వంగల (Surya Vangala) దర్శకత్వం వహించగా, ఆశిష్ కొల్ల (Ashish Kolla) దీనికి నిర్మాత. ఇది సోనీ లివ్ (Sony Liv) కోసం నిర్మిస్తున్న వెబ్ సిరీస్.

trishakrishnan2.jpg

ఇది పోలీస్ నేపధ్యం లో వస్తున్న సినిమా. ఇందులో క్రైమ్ ఎలిమెంట్, నేరపరిశోధన ఇంకా చాలా ఎలెమెంట్స్ వున్నాయి. ఇది ఎనిమిది ఎపిసోడ్స్ గా మొదటి సీజన్ లో వస్తోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో త్రిష ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రని వేస్తోంది. ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుండబోతోంది అని తెలిసింది. అయితే మొదటి సారిగా త్రిష చేస్తున్న వెబ్ సిరీస్ ఇదే అవటం ఆసక్తికరం. ఎందుకంటే ఆమెకి ఈ కథ నచ్చి ఇది చేస్తాను వెంటనే ఒప్పుకోవటం. ఇది ఒక్క తెలుగులోనే కాకుండా, ఇతర భాషల్లో కూడా విడుదల అవుతుంది. 'ఫామిలీ మేన్' లో నటించిన చాలామంది నటులను ఈ వెబ్ సిరీస్ లో తీసుకున్నారని కూడా తెలిసింది.

trishakrishnan.jpg

'పొన్నియన్ సెల్వన్ 2' విడుదల అయినా తరువాత త్రిష విడుదల ఈ వెబ్ సిరీస్ మాత్రమే. ఇది జూన్, జులై లో విడుదల కావచ్చు అని తెలిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని తెలిసింది. ఆశిష్ కొల్ల, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల (Avinash Kolla) సోదరుడే !

Updated Date - 2023-04-23T17:24:16+05:30 IST