సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Tovino Thomas: ఆ ఇద్దరితో అవకాశం వస్తే వదులుకోను!

ABN, First Publish Date - 2023-05-27T17:33:12+05:30

మలయాళ కథానాయకుడు టోవినో థామస్‌ (tovino Thomos) కీలక పాత్ర పోషించిన చిత్రం ‘2018’(2018 telugu). జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ 2018 కేరళ వరదల (kerala floods)నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సూపర్‌ హిట్టైంది. జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు (Bunnyvas)ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మలయాళ కథానాయకుడు టోవినో థామస్‌ (tovino Thomos) కీలక పాత్ర పోషించిన చిత్రం ‘2018’(2018 telugu). జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ 2018 కేరళ వరదల (kerala floods)నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సూపర్‌ హిట్టైంది. జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు (Bunnyvas)ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో టొవినో మాట్లాడుతూ అవకాశం వస్తే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌తో మల్టీస్టారర్‌ నటిస్తానని చెప్పారు. ఆ మేరకు ఆయన మాట్లాడుతూ ‘‘ 2018 వరదలు మా రాష్ట్రానికి ఓ పీడకల. దానిని డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా అనుకుని, ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు తెలుగులోనూ అద్భుతమైన కలెక్షన్లతో ఆడుతోంది, ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ షూట్‌ చేస్తున్నప్పుడు నాకు అప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఆ వరదల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది డబ్బు, నివాసాలు పోగొట్టుకున్నారు. ఆ పీడకలకు సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర ఓ కథ ఉంది. వాటన్నింటితో వెబ్‌ సిరీస్‌ చేేస్త మూడు సీజన్లు విడుదల చేయొచ్చు. (To do movie with Ntr and Ram charan)

ఇదే మొదటిసారి...

చదువుతున్న రోజుల్లో రామోజీ ఫిలింసిటీ టూర్‌ కోసం 2009లో తొలిసారి హైదరాబాద్‌కు వచ్చాను. నటుడిని అయ్యాక పలు అవార్డుల వేడుకల కోసం మళ్లీ వచ్చాను. కాకపోతే సినిమా ప్రమోషన్‌ కోసం రావడం ఇదే మొదటిసారి. ఇదెంతో ఆనందంగా ఉంది. నేను నటించిన సినిమాలు విడుదలైన ప్రతిసారీ తెలుగులో విడుదల చేయాలంటూ ఎంతోమంది అడుగుతుంటారు.ఇతర భాషా హీరోలతో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అంటే నాకెంతో ఇష్టం. వారితో సినిమా చేేస అవకాశం వస్తే వదులుకోను’’ అని టోవినో అన్నారు.

Updated Date - 2023-05-27T17:33:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!