NTR30: టెక్నిషియన్స్ అదుర్స్, అస్సలు తగ్గేదే లే

ABN , First Publish Date - 2023-03-28T11:56:43+05:30 IST

ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ కి సర్వం సిద్ధం అయింది. టాప్ టెక్నిషియన్స్ ని ఈ సినిమాకోసం తీసుకువచ్చారు. ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఉండేట్టు చూసుకుంటున్నారు. కొరటాల శివ ఇంక షూటింగ్ మొదలెట్టడమే తరువాయి.

NTR30: టెక్నిషియన్స్ అదుర్స్, అస్సలు తగ్గేదే లే

ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో వస్తున్న సినిమా (NTR30) రోజు రోజుకీ అంచనాలను పెంచేస్తోంది. ఆ చిత్ర నిర్వాహకులు అసలు ఎక్కడా తగ్గేదే లే అన్నట్టుగా ఆ సినిమాకి ఎక్కడెక్కడ నుండే అంటే విదేశాలనుండి పేరున్న సాంకేంతిక నిపుణలను హైదరాబాద్ కి రప్పిస్తున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పుడే ఈ సినిమాకి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాబు సిరిల్ (Sabu Cyril) ని ప్రొడక్షన్ డిజైనర్ గా పెట్టుకోవటం, అలాగే టాప్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు (Ratnavelu) ను తీసుకున్నారు.

ntr30.jpg

ఆ తరువాత హాలీవుడ్ నుండి యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బాట్స్ (Kenny Bates) ని కూడా హైదరాబాద్ రప్పించారు. అంటే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అందరికీ ఇప్పటికే అర్థం అయిపోతోంది. అలాగే ఈ సినిమాకి వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్ గా ఇంకో హాలీవుడ్ టెక్నిషియన్ బ్రాడ్ మిన్నిచ్ (Brad Minnich) ని రప్పించారు. ఈ సినిమాలో కొంత గ్రాఫిక్ వర్క్ కూడా వుంది. అందుకని బ్రాడ్ ని రప్పించారు, అతను దగ్గరుండి ఈ వర్క్ చూసుకుంటాడు.

ntr30koratalasiva.jpg

ఇలా హాలీవుడ్ నుండి, అలాగే ఇండియా లో టాప్ సాంకేంతిక నిపుణలను ఈ సినిమాకి పనిచేయడానికి రప్పిస్తున్నారు అంటే ఈ సినిమా ఎంత భారీగా ప్లాన్ చేస్తున్నారో అర్థం అవుతోంది. అలాగే ఈ సినిమా ఒక్క పాన్ ఇండియా నే కాకుండా, ప్రపంచం అంతా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా అర్థం అవుతోంది.

ntr30koratalasiva1.jpg

ఇందులో కథానాయకురాలుగా దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ని ఎప్పుడో ప్రకటించారు. సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander), ఇంకా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తో పాటు చాలామంది ఇతర పరిశ్రమలకు చెందిన నటులు ఉంటారని కూడా తెలుస్తోంది. వీటన్నికీ తోడు, ఎన్టీఆర్ ఇప్పుడు ఒక గ్లోబల్ ఇమేజ్ సంపాదించాడు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా వుండబోతోంది అన్నట్టుగా ఎక్కడా తగ్గకుండా సరియైన ప్లానింగ్ తో వెళుతున్నట్టు కనపడుతోంది. ఈ సినిమాకి నిర్మాత ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram).

Updated Date - 2023-03-28T11:56:44+05:30 IST