Tollywood Movies On Sets : ఒకే లొకేషన్లో  ఆట.. పాట.. పోరాటం!

ABN , First Publish Date - 2023-12-05T16:53:05+05:30 IST

సినిమాల్లో భారీ పరిశ్రమలు, పోరాట సన్నివేశాలంటే గుర్తొచ్చే లొకేషన్  హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ. నగర శివార్లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో నిత్యం ఏదో ఒక షూటింగ్‌ జరుగుతూ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తాజాగా టాలీవుడ్‌కు సంబంధించిన నాలుగు చిత్రాల షూటింగ్‌ అక్కడ జరుగుతోంది.

Tollywood Movies On Sets : ఒకే లొకేషన్లో  ఆట.. పాట.. పోరాటం!

సినిమాల్లో భారీ పరిశ్రమలు, పోరాట సన్నివేశాలంటే గుర్తొచ్చే లొకేషన్  హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ (Aluminum factory) . నగర శివార్లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో నిత్యం ఏదో ఒక షూటింగ్‌ జరుగుతూ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తాజాగా టాలీవుడ్‌కు సంబంధించిన నాలుగు చిత్రాల షూటింగ్‌ అక్కడ జరుగుతోంది. జూ.ఎన్టీఆర్‌ (NTR) 'దేవర' (Devara) , నాని హీరోగా నటిస్తున్న 'సరిపోదా శనివారం’, 'గుంటూరు కారం' (Guntur karam)చిత్రాల షూటింగ్‌ వేర్వేరు సెట్స్‌లో జరుగుతోంది. ఆ విశేషాలేంటో చూద్దాం...

NTr.jpg

కథ మొదలయ్యేది అక్కడే..

ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'దేవర’. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతుంది. కొరటాల శివ దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రతినాయకుడు సైఫ్‌ అలీఖాన్  ఇంట్రడక్షన్  సీన్స్  తెరకెక్కిస్తున్నారు కొరటాల. ఆయన ఇంట్రడక్షన్  సినిమాలకు ఎంతో కీలకమని, ఆ సన్నివేశంతోనే సినిమా కథ మొదలువుతుందని చిత్ర బృందం నుంచి సమాచారం. ఇప్పటికే పలు షెడ్యూళ్లలో కీలక సన్నివేశాలు పూర్తి చేశారు. ఇందులో హీరోకు సమానంగా విలన్  పాత్ర ఉంటుందని సమాచారం. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నారు.

Gunturkaaram.jpg

మహేష్ పాట పూర్తి చేశాడు..

మహేష్ బాబు  కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'గుంటూరు కారం’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. మహేష్‌, మీనాక్షి చౌదరిపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ పాటను షూట్‌ చేశారు. శ్రీలీల మెయిన్  హీరోయిన్ గా  నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది.

Nani.jpg

మరోవైపు నాని హీరోగా నటిస్తున్న 'సరిపోదా శనివారం' చిత్రం షూటింగ్‌ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రస్తుతం నాని 'హాయ్‌ నాన్న’ చిత్రం ప్రమోషన్లో పాల్గొంటూనే ఈ సినిమా షూటింగ్‌ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం నాని లేని సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. వివేక్‌ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకుడు. డి.వి.వి దానయ్య నిర్మాత.

Prabhas.jpg

ఇదిలా ఉండగా ఇంకో పక్క ప్రభాస్‌ సినిమాకు సంబంధించిన సెట్‌ కూడా రెడీ చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించబోతున్న చిత్రం షూటింగ్‌ కోసం అల్యూమినియం ఫ్ట్యాక్టరీలో ప్రత్యేకంగా సెట్‌ వేస్తున్నారు. సెట్‌ వర్క్‌ పూర్తయ్యాక ఈ చిత్రం షూటింగ్‌ మొదలవుతందని సమాచారం. 

Updated Date - 2023-12-05T17:00:07+05:30 IST