Dil Raju: టాలీవుడ్ స్టార్స్ అందరూ కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలకు...

ABN , First Publish Date - 2023-06-29T16:29:39+05:30 IST

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా ఈరోజు జూబిలీ హిల్స్ లోని ఒక ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్నారని తెలిసింది. టాలీవుడ్ లోని అగ్ర నటులతో సహా చాలామంది ఈ వేడుకకు హాజరు అవుతారని కూడా తెలిసింది.

Dil Raju: టాలీవుడ్ స్టార్స్ అందరూ కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలకు...
Dil Raju with his wife

దిల్ రాజు (DilRaju) ఏమి చేసిన అట్టహాసంగా, ఘనంగా చేస్తాడని సినీ పరిశ్రమలో అంటూ వుంటారు. ఈరోజు దిల్ రాజు కుమారుడు అన్వీ రెడ్డి (AnvyReddy) మొదటి పుట్టినరోజు. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017 లో పరమపదించగా, వారి కుమార్తె అయిన హన్షిత రెడ్డి (HanshithaReddy), తన తండ్రి ఒంటరి తనాన్ని చూడలేక, అతనికి కూడా తోడు కావాలని, తండ్రిని ఒప్పించి వైఘా రెడ్డితో (Vygha Reddy) 2020లో వివాహం చేయించారు. వారిద్దరికి గత సంవత్సరం జూన్ 29 న కుమారుడు కలిగాడు. అతనికి అన్వీ రెడ్డి అని పేరు పెట్టుకున్నారు.

ఈరోజు తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా దిల్ రాజు కుటుంబ సభ్యులు రాజుతో సహా తిరుమల సందర్శించారు. అలాగే ఈరోజు జెఆర్సి (JRC Function Hall) ఫంక్షన్ హాల్ లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేయనున్నారని తెలిసింది. మొదటి పుట్టినరోజు కాబట్టి, కొంచెం ఘనంగానే చెయ్యాలని దిల్ రాజు నిర్ణయించినట్టు, అందుకు టాలీవుడ్ లోని అతిరధ మహారధులందరినీ ఆహ్వానించినట్టుగా కూడా తెలిసింది.

dilrajuson.jpg

టాలీవుడ్ కి చెందిన అగ్రనటులతో పాటు, చాలామంది దర్శకులు, సాంకేతిక నిపుణులు, ఇతర నిర్మాతలు అందరికీ ఈ ఆహ్వానాలు పంపినట్టుగా తెలిసింది. సాయంత్రం నుండి మొత్తం టాలీవుడ్ అంతా ఆ ఫంక్షన్ హాల్ దగ్గరే ఉంటుందని కూడా అంటున్నారు. దిల్ రాజు కుమార్తె, అల్లుడు ఈ కార్యనిర్వహణ భారాన్ని తీసుకున్నారని కూడా తెలిసింది. అలాగే దిల్ రాజు అన్న కుమారుడు హర్షిత్ రెడ్డి (HarshithReddy) కూడా ఈ పుట్టినరోజు కార్యక్రమం ఘనంగా జరిగేటట్టు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నాడని కూడా తెలిసింది.

ఇదిలా ఉండగా, దిల్ రాజు ఇప్పుడు పెద్ద, చిన్న బడ్జెట్ సినిమాలు వరసగా నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్ (RamCharan) తో 'గేమ్ చెంజర్' #GameChanger సినిమా షూటింగ్ అవుతోంది. శంకర్ (Shankar) దీనికి దర్శకుడు, కియారా అద్వానీ (KiaraAdvani) కథానాయిక. అలాగే తన అన్న కుమారుడు ఆశిష్ రెడ్డి (AshishReddy) తో ఒక సినిమా షూటింగ్ అవుతోంది, అలాగే ఇంకో రెండు చిన్న బడ్జెట్ సినిమాలు కూడా షూటింగ్ నడుస్తున్నాయి.

Updated Date - 2023-06-29T16:29:39+05:30 IST