#TarakaRatna: టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

ABN , First Publish Date - 2023-02-19T10:37:39+05:30 IST

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

#TarakaRatna: టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
Tarakaratna

టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, నందమూరి, నారా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. మూడు వారాల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం (Yuva Galam) పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు (Heart Attack) వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బెంగళూరులోని (Bangalore) నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18న కన్నుముశారు. తారకరత్న మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

‘తారకరత్న గారి మరణ వార్త విని చాలా బాధ పడ్డాను. చాలా త్వరగా వెళ్లిపోయారు. ఆయన కుటుంబం, స్నేహితులు, అభిమానులకి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని అల్లు అర్జున్ రాసుకొచ్చారు.


ఇది కూడా చదవండి: Rip Taraka Ratna: అది తారకరత్నకే దక్కిన రికార్డు!

‘తారకరత్న మరణవార్త విని చాలా బాధ కలిగింది. ఆయన మంచి హృదయానికి అందరి మనసుల్లో నిలిచిపోతారు. ఆయన సన్నిహితులకి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని రాసుకొచ్చారు.

Updated Date - 2023-02-19T10:41:30+05:30 IST