Theater And OTT Movies : ఈ వారం థియేటర్‌.. ఓటీటీ సినిమాలివే..!

ABN , First Publish Date - 2023-09-04T15:11:45+05:30 IST

సెప్టెంబర్‌ నెల హిట్‌ సినిమాతో మొదలైంది. ఒకటో తేదిన విడుదలైన ‘ఖుషి’ సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. అదే జోరుతో ఈ వారం కూడా థియేటర్స్‌, ఓటీటీ సందడి చేయడానికి పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. అవేంటో  తెలుసుకుందాం...

Theater And OTT Movies : ఈ వారం థియేటర్‌.. ఓటీటీ సినిమాలివే..!

సెప్టెంబర్‌ నెల హిట్‌ సినిమాతో మొదలైంది. ఒకటో తేదిన విడుదలైన ‘ఖుషి’ సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. అదే జోరుతో ఈ వారం కూడా థియేటర్స్‌, ఓటీటీ సందడి చేయడానికి పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. అవేంటో  తెలుసుకుందాం...

Polishetty.jpg

మూడేళ్ల తర్వాత అనుష్క.. (miss shetty mr polishetty)

తెరపపై అనుష్కను చూసి మూడేళ్లు అవుతోంది. ‘నిశ్శబ్దం’ చిత్రం తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్న ఆమె తాజాగా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది. మహేశ్‌బాబు.పి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోగా నటించిన నవీన్‌ పోలిశెట్టి స్టాండప్‌ కమెడీయన్‌గా, అనుష్క చెఫ్‌ పాత్రలు పోషించారు. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడో తేదిన విడుదల కానుంది. అభినవ్‌ గోమటం, మురళీశర్మ, తులసి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Jawan.jpg

‘పఠాన్‌’తో మెప్పించి ‘జవాన్‌’గా... (Jawan)

‘పఠాన్‌’ చిత్రంతో రికార్డులు సృష్టించిన బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్‌ థ్ర్లిలర్‌ ‘జవాన్‌’. తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రానికి దర్శకుడు. నయనతార కథానాయిక. బ్లాక్‌బస్టర్‌ ‘పఠాన్‌’ తర్వాత షారుక్‌ నుంచి వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌, పాటలకు చక్కని స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌ అయితే ఓ రేంజ్‌లో సంచలనం సృష్టించింది. విజయ్‌ ేసతుపతి విలన్‌ పాత్ర పోషించిన ఈ చిత్రంలో ప్రియమణి, సన్యా మల్హోత్రా కీలక పాత్రధారులు. ఈ నెల 7న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది.

Jailer.jpg

ఈ వారం విడుదలయ్యే ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు ఇవే... (OTT)

ఇప్పటికే థియేటర్‌లో అలరించిన చిత్రాలు ఓటీటీలో కూడా సందడి చేయడానికి రెడీ అయ్యాయి. ఆగస్ట్‌ 10న విడుదలై సంచలన విజయం సొంతం చేసుకున్న ‘జైలర్‌’ (Jailer) సినిమా కోసం ఓటీటీ వీక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన ఈ చిత్రం ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ వేదికగా సెప్టెంబర్‌ 7 నుంచి స్ర్టీమింగ్‌ కానుంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ బాషల్లో కూడా అందుబాటులో ఉంది.

Trans.jpg

ట్రాన్స్‌జెండర్‌గా నవాజుద్దీన్‌..

ట్రాన్స్‌జెండర్‌ పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు నవాజుద్దీన్‌ సిద్థిఖీ. ఆయన కీలక పాత్రలో అక్షత్‌ అజయ్‌ శర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘హడ్డీ’. ఇందులో నవాజుద్దీన్‌.. అమ్మాయిగా మారాలనుకునే హరి అనే పాత్రలో నటిస్తున్నారు. మరి హరి అమ్మాయిగా మారడానికి కారణం ఏంటి? తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అతనికి జరిగిన అన్యాయ్యానికి ఎలా పగతీర్చుకున్నాడు? అన్నది కథ. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా సెప్టెంబరు 7వ తేదీ నుంచి స్ర్టీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌: సెప్టెంబరు 5

షేన్‌ గీల్లీస్‌ (హాలీవుడ్‌)

స్కాట్స్‌ హానర్‌ (హాలీవుడ్‌)

సెప్టెంబరు 7

కుంగ్‌ఫూ పాండా (వెబ్‌సిరీస్‌3)

టాప్‌ బాయ్‌ (వెబ్‌సిరీస్‌2)

వర్జిన్‌ రివర్‌ (వెబ్‌సిరీస్‌)

సెప్టెంబరు 8: సెల్లింగ్‌ ది ఓసీ (వెబ్‌సిరీస్‌2)

అమెజాన్‌ ప్రైమ్‌

సెప్టెంబరు 5 : వన్‌ షాట్‌ (వెబ్‌సిరీస్‌)

సెప్టెంబరు 6 : లక్కీ గౌ (హిందీ)

సెప్టెంబరు 8 : సిట్టింగ్‌ ఇన్‌ బార్స్‌ విత్‌ కేక్‌(హాలీవుడ్‌)

డిస్నీ+హాట్‌స్టార్‌

సెప్టెంబరు 6 : ఐ యామ్‌ గ్రూట్‌ (వెబ్‌సిరీస్‌2)

ఆహా

సెప్టెంబరు 8 : లవ్‌ (తమిళ చిత్రం)

ఆపిల్‌ టీవీ ప్లస్‌

సెప్టెంబరు 8 : ది ఛేంజ్‌లింగ్‌ (హాలీవుడ్‌)

Updated Date - 2023-09-04T15:20:39+05:30 IST