Tollywood Movies : థియేటర్‌ - ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!

ABN , First Publish Date - 2023-11-13T14:00:30+05:30 IST

దీపావళి సీజన్లో పెద్ద చిత్రాల సందడి ఏమీ లేదు. రెండు, మూడు తెలుగు చిత్రాలతోపాటు అనువాద చిత్రాల హవానే కనిపిస్తోంది. ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే సినిమాలపై ఓ లుక్కేద్దాం...

Tollywood Movies : థియేటర్‌ - ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!

దీపావళి సీజన్లో పెద్ద చిత్రాల సందడి ఏమీ లేదు. రెండు, మూడు తెలుగు చిత్రాలతోపాటు అనువాద చిత్రాల హవానే కనిపిస్తోంది. ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే సినిమాలపై ఓ లుక్కేద్దాం...

'ఆర్‌ఎక్స్‌ 100'తో పాపులర్‌ అయిన పాయల్‌ రాజ్‌పూత్‌(payal rajputh), అజయ్‌ భూపతి కాంబోలో వస్తున్న చిత్రం 'మంగళవారం' (Mangalavaaram). అజ్మల్‌ అమిర్‌ కీలక పాత్రధారుడు. ముద్ర మీడియా వర్క్స్‌ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ.ఎం. నిర్మించారు. నవంబరు 17న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. బోల్డ్‌ కంటెంట్‌తోపాటు ఇప్పటి వరకూ ఇండియా ఏ దర్శకుడు టచ్ చేయని పాయింట్‌ని తీసుకున్నట్లు దర్శకుడు అజయ్‌ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రం ఆసక్తి కలిగించిన సంగతి తెలిసిందే!

Mangaavaaram.jpg

ఉత్కంఠభరితంగా

హన్సిక మోత్వాని (Hansika) ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ (my name is Shruthi) అంటూ మూవీ లవర్స్‌ని థ్రిల్‌ చేేసందుకు సిద్థమవుతోంది. కథానాయికగా ప్రాధాన్యమున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్‌ ఓంకార్‌ తెరకెక్కిస్తున్నారు. బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు. ‘‘ఊహకందని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రమని దర్శకుడు చెబుతున్నారు. తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించు యువతిగా హన్సిక కనిపిస్తుంది. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

My name is shruthi.jpg

అడవి నేపథ్యంలో..

విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అన్వేషి’. వి.జె.ఖన్నా దర్శకుడు. టి.గణపతిరెడ్డి నిర్మాత. ‘‘అడవి నేపథ్యంలో సాగే కథ ఇది. కథానాయిక అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషించారు. ఆమె చుట్టూ సాగే సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతంతో ఆకట్టుకుంటాడు’’అని సినిమా టీమ్‌ చెబుతోంది. నవంబరు 17న ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

ఎ హిట్‌.. మరి బి..

కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి కీలక పాత్రలో నటించిన ప్రేమకథా చిత్రం ‘సప్త సాగరాలు దాటి సైడ్‌-ఎ’ 9Sapta sagaraalu daati plan B). రుక్మిణీ వసంత్‌ కథానాయిక. హేమంత్‌ ఎం రావు దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడిదే చిత్రానికి కొనసాగింపుగా ‘సప్త సాగరాలు దాటి సైడ్‌ బి’ విడుదల కానుంది. నవంబర్‌ 17న కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు కానుంది.

విక్రాంత్‌ హీరోగా నటించి.. స్వయంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్పార్క్‌ లైఫ్‌’. మెహరీన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికలు. డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం థియేటర్‌లలో విడుదల కానుంది

ఈ వారం ఓటిటిలో సందడి చేసే చిత్రాలివే 

అమెజాన్‌ ప్రైమ్‌

నవంబరు 17 :  ట్విన్‌ లవ్‌ (హాలీవుడ్‌) 

Chinna.jpg

డిస్నీ+హాట్‌స్టార్‌

నవంబరు 15  :  అపూర్వ (హిందీ) 

నవంబరు 17 : చిత్త (తమిళ/తెలుగు)

కన్నూర్‌ స్క్వాడ్‌ (మలయాళం) 

Railway.jpg

నెట్‌ఫ్లిక్స్‌

నవంబరు 14 :  హౌటూ బికమ్‌ ఏ మాబ్‌ బాస్‌ (వెబ్‌సిరీస్‌) 

నవంబరు 16 :  బెస్ట్‌ క్రిస్మస్‌ ఎవర్‌ (హాలీవుడ్‌) 

నవంబరు 16 :  ది క్రౌన్‌ (వెబ్‌సిరీస్‌) 

నవంబరు 17 :  ది డాడ్స్‌ (హాలీవుడ్‌)

నవంబరు 17 :  సుఖీ (హిందీ) 

నవంబరు 17 :  బిలీవర్‌2 (కొరియన్‌) 

నవంబరు 18 :  ది రైల్వేమెన్‌ (హిందీ) 

బుక్‌ మై షో

నవంబరు 17 :  ది ఎగ్జార్సిస్ట్‌ (హాలీవుడ్‌) 

నవంబరు 12 :  రాంగ్‌ ప్లేస్‌ (హాలీవుడ్)

 జియో సినిమా

నవంబరు 15 :  ది ఫ్లాష్‌ (తెలుగు) 

Updated Date - 2023-11-13T14:01:31+05:30 IST