ఈసారి యాక్షన్‌ థ్రిల్లర్‌తో..

ABN , First Publish Date - 2023-02-17T23:52:41+05:30 IST

‘స్వాతిముత్యం’ చిత్రంతో హీరోగా పరిచయమైన బెల్లంకొండ గణేశ్‌ నటిస్తున్న రెండో సినిమా ‘నేను స్టూడెంట్‌ సార్‌’....

ఈసారి యాక్షన్‌ థ్రిల్లర్‌తో..

‘స్వాతిముత్యం’ చిత్రంతో హీరోగా పరిచయమైన బెల్లంకొండ గణేశ్‌ నటిస్తున్న రెండో సినిమా ‘నేను స్టూడెంట్‌ సార్‌’. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకొంటున్న ఈ సినిమాను ‘నాంది’ సతీష్‌ వర్మ నిర్మిస్తున్నారు. రాకేశ్‌ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను మార్చి 10న విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అవంతిక దస్సాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని, సునీల్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - 2023-02-17T23:52:44+05:30 IST