Gemini Tv: ఈ ఆదివారం.. జెమినీ టీవీలో వ‌చ్చే సినిమాలివే

ABN , First Publish Date - 2023-11-17T17:29:16+05:30 IST

ప్ర‌స్తుతం ఓటీటీలు, టీవీలు, థియేట‌ర్లు మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించే ముఖ్య సాధ‌నం. ప్ర‌ధానంగా రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఇంకా 50% జ‌నం టీవీల‌నే చూస్తున్నారు, వాటికే ప్ర‌ధాన్య‌త‌నిస్తున్నారు కూడా. ఈ క్ర‌మంలో ఈ ఆదివారం జెమినీటీవీలో ఎయే సినిమాలు ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.

Gemini Tv: ఈ ఆదివారం.. జెమినీ టీవీలో వ‌చ్చే సినిమాలివే
dasara

ప్ర‌స్తుతం ఓటీటీలు, టీవీలు, థియేట‌ర్లు మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించే ముఖ్య సాధ‌నం. ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్‌లో ఓటీటీలు, థియేట‌ర్లు అనేవి న‌గ‌రాల‌లో ఉండే వారికి, చేతిలో మోబైల్స్‌, అందులో అన్ లిమిటెడ్ డాటా ఉన్న‌వారికే అందుబాటులో ఉన్న‌ది. రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఇంకా 50% జ‌నం టీవీల‌నే చూస్తున్నారు. వాటికే ప్ర‌ధాన్య‌త‌నిస్తున్నారు కూడా.

ఇప్ప‌టివ‌ర‌కు చాలా మంది థియేట‌ర్లు, ఓటీటీల్లో విడుద‌ల‌య్యే సినిమాల స‌మాచారం ఎలా అయితే ఇస్తూ వ‌స్తున్నారో అదేవిధంగా ఇర‌పై టీవీల‌లో ప్ర‌తి శ‌ని, ఆదివారాల్లో ఎయే సినిమాలు ఏ ఛాన‌ల్‌లో, ఏ స‌మ‌యానికి వ‌స్తాయో వివ‌రాలు ఇవ్వ‌డం జ‌రుగుతుంది. టీవీ వీక్ష‌కులు త‌మ‌కు ఇష్ట‌మైన చిత్రాన్ని ఆ స‌మ‌యానికి ఇంట్లో కుటుంబంతో క‌లిసి చూడ‌వ‌చ్చు.


19 ఆదివారం రోజున‌ జెమిని(Gemini) టీవీలో ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు నాన్‌స్టాప్‌గా 5 పెద్ద‌ సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయి. ఉద‌యం 8.30కు జైల‌ర్ ఫేమ్ నెల్స‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ స్టార్‌ ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన బీస్ట్ ప్ర‌సారం కానుంది. ఆ త‌ర్వాత 12 గంట‌కు నాచుర‌ల్ స్టార్ , కీర్తి సురేశ్ న‌టించిన ద‌స‌రా సినిమా ప్ర‌సారం కానుంది.

మ‌ధ్యాహ్నం 3.గంట‌ల‌కు ఐశ్వ‌ర్యా రాజేశ్‌, రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించిన కౌస‌ల్యా కృష్ణ‌మూర్తి, సాయంత్రం 6 గంట‌ల‌కు బాల‌కృష్ణ, న‌య‌న‌తార‌లు న‌టించిన జై సింహ‌, రాత్రి 9 గంట‌ల‌కు శ‌ర్వానంద్ న‌టించిన ర‌న్ రాజా ర‌న్ ప్ర‌సారం కానున్నాయి. అదేవిధంగా 18 శ‌నివారం(Saturday) రోజున ఉద‌యం 8.30 గంట‌ల‌కు ర‌వితేజ న‌టించిన కిక్ (Kick) ప్ర‌సారం కానుంది.

Updated Date - 2023-11-17T17:34:09+05:30 IST