Mahesh and Nagarjuna: సంక్రాంతికి బీడీల గోల, ఇద్దరూ మాస్ తో వస్తున్నారు

ABN , First Publish Date - 2023-08-30T12:47:09+05:30 IST

అదే బీడీ, అదే లుంగీ, ఎంత యాదృచ్ఛికం అంటే మహేష్ బాబు, నాగార్జున ఇద్దరూ ఒకలాంటి మాస్ లుక్ తో రానున్న సంక్రాంతి పండగకి అలరించనున్నారు అని అర్థం అవుతుంది. నిన్న నాగార్జున 'నా సామి రంగా' టీజర్, అలాగే మహేష్ బాబు 'గుంటూరు కారం' టీజర్ చూస్తే ఇద్దరూ బీడీ వెలిగించి, లుంగీ లో కనపడతారు.

Mahesh and Nagarjuna: సంక్రాంతికి బీడీల గోల, ఇద్దరూ మాస్ తో వస్తున్నారు
Mahesh Babu and Nagarjuna looks from their upcoming films Guntur Kaaram and Naa Saami Ranga

మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో 'గుంటూరు కారం' #GunturKaaram సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వేగం చూస్తుంటే, సంక్రాంతికి అనుకున్న తేదీకి మహేష్ బాబు సినిమా విడుదల అవొచ్చు అని అంటున్నారు. అంత వేగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్నారని ఒక టాక్ నడుస్తోంది. చాలామంది కాంబినేషన్ నటులు వున్నా, అందరికీ ముందే చెప్పి పెట్టుకొని ఈ సినిమా షూటింగ్ కోసం మూడు హౌస్ సెట్లు వేశారని, ఎవరు దొరికితే ఆ సంబంధిత ఇంట్లో షూటింగ్ చేస్తున్నారని తెలిసింది.

gunturkaram-maheshbabu.jpg

కథానాయకుడు అయిన మహేష్ బాబు హౌస్ సెట్, అలాగే ప్రకాష్ రాజ్ (PrakashRaj) ఆఫీస్ సెట్, ఇంకోటి కథానాయిక అయిన శ్రీలీల (Sreeleela) హౌస్ సెట్ ఇలా మూడు సెట్లు వేశారని, కాంబినేషన్ చూసుకుంటూ చక చకా షూటింగ్ చేసేస్తున్నారని కూడా తెలిసింది. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ (RamyaKrishna), రావు రమేష్ (RaoRamesh), రోహిణి, మురళి శర్మ (MuraliSharma), జయరాం, రాహుల్ రవీంద్రన్, రవి శంకర్, బ్రహ్మాజీ (Brahmaji), వెన్నెల కిషోర్ (VennelaKishore) ఇలా చాలామంది క్యారెక్టర్ నటులు వున్నారని తెలిసింది. ఈ సినిమా నుండి టీజర్, ఫస్ట్ లుక్ విడుదలయ్యాయి, అందులో మహేష్ బాబు బీడీ కలుస్తూ, లుంగీ కట్టుకొని వున్న ఫోటోస్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

nagarjuna-poster1.jpg

ఇప్పుడు అలాంటింది అంటే అదే బీడీ, లుంగీ లుక్ లో ఒక సీనియర్ నటుడు నాగార్జున (AkkineniNagarjuna) కూడా కనిపించనున్నారు. నిన్న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'నా సామి రంగా' #NaaSaamiRanga టీజర్ లో నాగార్జున బీడీ కలుస్తూ, లుంగీ కట్టిన సన్నివేశం చూసాం. విజయ్ బిన్నీ (VijayBinni) దీనికి దర్శకుడు కాగా, ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదల అని టీజర్ లో విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. ఆంటీ ఈ రెండు బీడీలు, లుంగీ లు కట్టుకున్న కథానాయకుల సినిమాలు సంక్రాంతికి పోటీ పడనున్నాయి అని అర్థం అవుతోంది.

ఇదేంటి ఈ సంక్రాంతి పండగకి ఈ బీడీల గోల అని నెటిజన్స్ ఒకటే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరూ ఇంచు మించు ఒకటే లుక్ లో కనపడుతున్నారు, అలాగే ఇద్దరూ సంక్రాంతి పండగకు వస్తున్నారు, మరి ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. అయితే సంక్రాంతికి ఎటువంటి సినిమా అయినా ఆ నాలుగు రోజులు బాగానే నడుస్తుంది అని, అందుకనే ఇద్దరూ సంక్రాంతికి వస్తున్నారని ఒక టాక్ నడుస్తోంది.

Updated Date - 2023-08-30T12:47:09+05:30 IST