ఈ అమ్మడికి అల్లు అర్జున్ అంటే ఇష్టంట, ఎందుకో తెలుసా...

ABN , First Publish Date - 2023-07-04T11:24:44+05:30 IST

'రంగబలి' తో కొత్త కథానాయిక యుక్తి తరేజా అనే ఆమె తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. ప్రచార చిత్రాల్లో భాగంగా ఆమె తనకి అవకాశం వస్తే అల్లు అర్జున్ తో డాన్స్ చెయ్యాలని వుంది అని చెప్తోంది.

ఈ అమ్మడికి అల్లు అర్జున్ అంటే ఇష్టంట, ఎందుకో తెలుసా...
Yukti Thareja

టాలెంటెడ్ నటుడు నాగ శౌర్య (NagaShaurya) ఎక్కువగా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ ఉంటాడు, ఇప్పుడు అలాగే తన రాబోయే సినిమా 'రంగబలి' #Rangabali సినిమాతో ఇంకో కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి (PavanBasamshetty) ని పరిచయం చేస్తున్నాడు. జూలై 7న విడుదల కానున్నఈ సినిమాలో యుక్తి తరేజ (YuktiThareja) అనే కొత్త అమ్మాయి కూడా కథానాయికగా తెలుగు తెరకి పరిచయం అవుతోంది. ఈ సినిమాలో కథానాయిక కోసం చాలామందిని ఎంపిక చేసి, అందులో యుక్తి ని తీసుకున్నారు.

yuktitareja.jpg

ఆమెకి మొదట లుక్ టెస్ట్ చేసాక, రెండు సీన్స్ కూడా ఇచ్చి ఆమెని నటించమని చెప్పారు. అప్పుడు ఈ పాత్రకు ఆమె సరిపోతుందని నమ్మకం కుదిరిన తర్వాతే ఎంపిక చేశారు. ఇందులో యుక్తి తరేజా మెడికల్ స్టూడెంట్ పాత్ర వేస్తోంది, ఆమె పాత్ర పేరు సహజ. ఆమె పాత్ర పేరుకి తగ్గట్టుగా ఈ సినిమాలో ఆమె పాత్ర కూడా చాలా సహజంగా ఉంటుంది అని యుక్తి చెప్తోంది. ఈ అమ్మాయి హర్యాన. ఢిల్లీ యూనీవర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే కాలేజీలో ఉన్నప్పుడే డ్యాన్స్ నేర్చుకున్నాను అని చెప్తోంది. తరువాత ఢిల్లీ ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్ లో విన్ అయింది, వెంటనే మోడలింగ్ మొదలు పెట్టాను అని అంటోంది. ఇప్పుడు ఈ తెలుగు సినిమా తో సినిమాల్లోకి వస్తున్నాను అని చెప్తోంది.

yuktitareja3.jpg

అయితే ఆమె మాతృభాష హిందీ కావటంతో, తెలుగు డైలాగ్స్ అన్నీ పలకటం కష్టం అయ్యేది అని చెప్తోంది. అందుకని దర్శకుడు స్క్రిప్ట్ ని ఆమెకి ముందుగానే ఇచ్చేసావాడు అని చెప్తోంది. ఆలా ఇవ్వటం వలన ఆ సీన్స్ ని బాగా నేర్చుకొని షూటింగ్ వెళ్ళటం వలన ఒక అవగాహన వచ్చేది అని చెప్పింది. ఆలా షూటింగ్ పూర్తి చేసాను, బాగా వచ్చింది నా పాత్ర అని అనుకుంటున్నాను అని చెప్పింది.

yuktitareja1.jpg

అయితే తెలుగులో మీ ఫేవరేట్ హీరో ఎవరు అని అడిగితే టక్కున అల్లు అర్జున్ (AlluArjun) అని చెప్పేసింది యుక్తి. అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టంట ఆమెకి, అదీ కాకుండా ఆయన డ్యాన్స్ ని మ్యాచ్ చేయడం చాలా కష్టం అని కూడా అంటోంది. అవకాశం వస్తే అల్లు అర్జున్ తో డ్యాన్స్ చేయాలని వుంది అని చెప్తోంది. అలాగే హీరోయిన్స్ లో అనుష్కశెట్టి (AnushkaShetty) అంటే ఇష్టం అని అంటోంది.

Updated Date - 2023-07-04T11:24:44+05:30 IST