ఇతనే... వికాస్‌ మాలిక్‌!

ABN , First Publish Date - 2023-05-20T02:58:32+05:30 IST

వెంకటేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సైంధవ్‌’. శైలేశ్‌ కొలను దర్శకుడు. శ్రద్దా శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తోంది....

ఇతనే... వికాస్‌ మాలిక్‌!

వెంకటేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సైంధవ్‌’. శైలేశ్‌ కొలను దర్శకుడు. శ్రద్దా శ్రీనాథ్‌ కథానాయికగా నటిస్తోంది. వెంకట్‌ బోయినపల్లి నిర్మాత. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నవాజుద్దీన్‌ పుట్టిన రోజు. ఈ పాత్రకు సంబంధించిన లుక్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. వికాస్‌ మాలిక్‌ పాత్రలో నవాజుద్దీన్‌ కనిపించనున్నారు. ఓ కారు డిక్కీపై స్టైల్‌గా కూర్చుని, బీడీ తాగుతున్న స్టిల్‌ ఇది. రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా తదితరులు నటిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని డిసెంబరు 22న విడుదల చేస్తున్నారు. సంగీతం: సంతోష్‌ నారాయణ్‌.

Updated Date - 2023-05-20T02:58:32+05:30 IST