Hidimbha: ఈ హీరోయిన్ మాట్లాడుతూ మధ్యలో ఏడ్చేసింది

ABN , First Publish Date - 2023-07-22T16:16:06+05:30 IST

'హిడింబ' సినిమా యూనిట్ సభ్యులు ఆ సినిమా 'థేంక్ యు' మీట్ పెట్టారు. అందులో నటించిన కథానాయకురాలు నందిత శ్వేతా మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ అప్పుడు తన తండ్రి చనిపోయారని ఇప్పుడు ఈ విజయం అతను చూసి ఉంటే బాగుండేదని భావోద్వేగానికి గురయింది.

Hidimbha: ఈ హీరోయిన్ మాట్లాడుతూ మధ్యలో ఏడ్చేసింది
Nandita Sweta at the success meet of her film Hidimbha

ఒక సినిమా పెద్ద హిట్ అయినా, తన ప్రతిభకి అందరూ అభిననందనలు తెలుపుతున్నా, అలాగే సినిమా విజయం సాధించినప్పుడు తనకి బాగా కావలసిన వాళ్ళు లేకపోయినా నటీనటులు కానివ్వండి, లేదా సాంకేతిక నిపుణులు అయినా ఆ బాధను తట్టుకోలేక చాలా భావోద్వేగానికి గురైపోతారు. అయితే అప్పుడు పరిస్థితి ఎలా వుంది, తాను ఎక్కడ వున్నదీ కూడా మర్చిపోయి, తనకి కావలసిన వాళ్ళని తలచుకొని తట్టుకోలేక ఒక్కోసారి ఏడ్చేస్తారు కూడా.

'హిడింబ' #Hidimbha సినిమాలో కథానాయకురాలు నందిత శ్వేతా (NanditaSweta) ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషించింది. ఆ సినిమాలో ఆమె నటనకి మంచి ప్రసంశలు కూడా వచ్చాయి. అనీల్ కన్నెగంటి (AneelKanneganti) ఈ సినిమాకి దర్శకుడు కాగా ఓంకార్ (Omkar) తమ్ముడు అశ్విన్ (Ashwin) ఇందులో కథానాయకుడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే పోతోంది.

nanditasweta1.jpg

ఈ సినిమా యూనిట్ ఈరోజు థేంక్ యు మీట్ ని నిర్వహించారు. అందులో నందిత శ్వేతా మాట్లాడుతూ ఈ సినిమాకి ఛాయాగ్రహణం చేసిన రాజశేఖర్ (Rajasekhar) అందరికీ థేంక్స్ చెప్పమన్నారని చెప్పింది, ఆలా అంటూ రాజశేఖర్ నాన్నగారు ఈ సినిమా షూటింగ్ అప్పుడు చనిపోయారని, అందుకనే ఈ సినిమా అందరికీ ఒక ఎమోషనల్ జర్నీ అంటూ తాను కూడా ఏడ్చేసింది. ఈ సినిమా షూటింగ్ అప్పుడు నందిత నాన్నగారు కూడా పోయారని, ఆమె తండ్రి హాస్పిటల్ లో వున్నప్పుడు ఆమె ఈ సినిమా షూటింగ్ చేస్తూ ఉందని, అందుకే ఈ సినిమా తనకి బాగా దగ్గర సినిమా అని చెపుతూ ఏడ్చేసింది.

వెంటనే అశ్విన్, దర్శకుడు అనీల్, మిగతా వాళ్ళు కూడా వచ్చి ఆమెని సముదాయించారు. ఈ 'హిడింబ' #Hidimbha సినిమా మొన్న విడుదల అయింది. ఇది ఒక థ్రిల్లర్, ఇందులో నరమాంస భక్షకుల నేపథ్యంలో దర్శకుడు అనిల్ ఒక కొత్త కథని నేరేట్ చేసాడు. ప్రతి సన్నివేశం ఇందులో కొత్తగా ఉంటుంది. రెండో రోజు నుండీ ఈ సినిమా కలెక్షన్స్ పుంజుకున్నాయని ఈ చిత్ర యూనిట్ చెపుతోంది.

Updated Date - 2023-07-22T16:20:36+05:30 IST