Thirty years prudhvi: అంబటి ఎవరో నాకు తెలియదు!

ABN , First Publish Date - 2023-07-31T13:16:51+05:30 IST

పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ నటించిన ‘బ్రో’ చిత్రంలో శ్యాంబాబు పాత్ర పోషించిన పృథ్వీ మరోసారి ఆ పాత్ర గురించి స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ ‘‘శ్యాంబాబు పాత్రకు ఇంతగా స్పందన వస్తుందని ఊహించలేదు

Thirty years prudhvi: అంబటి ఎవరో నాకు తెలియదు!

పవన్‌కల్యాణ్‌(Pawan kalyan), సాయిధరమ్‌ తేజ్‌ (Sai dharam tej) నటించిన ‘బ్రో’ (Bro) చిత్రంలో శ్యాంబాబు పాత్ర పోషించిన పృథ్వీ మరోసారి ఆ పాత్ర గురించి స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ ‘‘శ్యాంబాబు పాత్రకు ఇంతగా స్పందన వస్తుందని ఊహించలేదు. ‘పృథ్వీగారు ఎందుకండీ మీ క్యారెక్టర్‌ ఇంత వైరల్‌ అయింది’ అని సముద్రఖని అడిగారు. సినిమాలో మంచి ఉందండీ, టైమ్‌ వ్యాల్యూ, హ్యూమన్‌ ఎమోషన్స్‌ ఉన్నాయి. అందుకే ఇంత కనెక్ట్‌ అయిందని చెప్పాను. టైమ్‌ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.. ఎంత సంపాదించిన చివరికి మట్టిలోకే వెళ్లాలి, ఉన్న సమయంలో ఆనందంగా ఉండాలి’ అని ఈ చిత్రంలో చెప్పిన పాయింట్‌ అందరికీ కనెక్ట్‌ అయింది. బీరువా నిండా అన్ని డ్రెస్‌లు పెట్టుకున్నవ్‌ ఒక్కటీ వేసుకోవు అని మా కుటుంబ సభ్యులు అంటే.. నిన్నటి నుంచే ఆ బట్టలు వేసుకోవడం మొదలుపెట్టా. ఈ సినిమా చూశాక టైమ్‌ వాల్యూ బాగా తెలిసింది. నేను కల్యాణ్‌గారితో మూడు సినిమాలు చేశా. ఈ సినిమాకు వచ్చిన స్పందన మాత్రం మాటల్లో చెప్పలేను. ఇదొక పొలిటికల్‌ కాంట్రవర్సీ అయింది. సినిమా చూసిన చాలామంది ‘ఏంటండీ మీ సినిమాలో ఏపీ మంత్రిని డీగ్రేడ్‌ చేశారట’ అని అడిగారు. ఆ మంత్రి పేరు అంబటి రాంబాబు అని చెప్పగానే అతనెవరో నాకు తెలీదు. తెలియని వాడి గురించి నేనెందుకు చేస్తాను. అతన్ని ఇమిటేట్‌ చేయడానికి అతనేమీ ఆస్కార్‌ సాధించిన నటుడు కాదు’’ అన్నాను. (Syambabu vs Rambabu)

‘ఒక బాధ్యతలేని, పనికి మాలిని వెధవ బారుల్లో పడి తాగుతుంటాడు. అమ్మాయిలతో డాన్స్‌ చేస్తుంటాడు. ఈ సినిమాలో ఇదీ మీ పాత్ర అని సముద్రఖని చెప్పారు. దర్శకుడు చెప్పిందానికి నేను న్యాయం చేశాను. అంబటి రాంబాబు క్యారెక్టర్‌ చేయాల్సిన అవసరం నాకు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆ పాత్ర గురించే టాపిక్‌ నడుస్తోంది. శ్యాంబాబు పాత్రకు ఇంత మైలేజ్‌ వస్తుందని అనుకోలేదు. ఈ సినిమా తర్వాత నేను కూడా చాలా మారాను. టైం లేదనకూడదు, అహంకారం ప్రదర్శించకూడదు వంటివి నేర్చుకున్నా. నేను ఉండే ప్రాంతంలో 70 ఏళ్లు పైబడిన ఎందరో ‘మంచి సినిమా చేశారండీ! టైమ్‌ వాల్యూ చెప్పారని’ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాతో నా లెక్కలు కూడా మారాయి. మధ్యలో సినిమాలు వదిలి నేను బయటకు వెళ్లా. మళ్లీ వెనక్కి వచ్చి చేసిన చిత్రమిది. ఈ సినిమాకు నాకు పాత రోజుల్లాగా మంచి రెమ్యునరేషన్‌ ఇచ్చారు నిర్మాత. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు’’ అని అన్నారు.

Updated Date - 2023-07-31T13:18:19+05:30 IST