Kota Bommali P.S: శ్రీకాకుళం యాసలో వచ్చిన ఈ 'లింగి లింగి లింగిడి' పాట వైరల్

ABN , First Publish Date - 2023-09-13T12:11:12+05:30 IST

ప్రముఖ కథానాయిక శ్రీలీల విడుదల చేసిన 'కోటబొమ్మాళి పి.ఎస్' సినిమాలోని 'లింగి లింగి లింగిడి' అనే పాట ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో వైరల్ అయింది. బన్నీ వాసు నిర్మాత, తేజ మార్ని దర్శకుడిగా వస్తున్న ఈ సినిమా మలయాళం సినిమా 'నాయట్టు' కి రీమేక్

Kota Bommali P.S: శ్రీకాకుళం యాసలో వచ్చిన ఈ 'లింగి లింగి లింగిడి' పాట వైరల్
Rahul Vijay, Bunny Vasu and Sreeleela at the launch of the Song

గీతా ఆర్ట్స్ 2 (GeethaArts2) సంస్థ తాజాగా మలయాళ సూపర్ హిట్ 'నాయాట్టు' #Nayaatu కి రీమేక్ గా 'కోట బొమ్మాళి పిఎస్' #KotaBommaliPS పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్ (BunnyVasu), విద్యా కొప్పినీడి (VidyaKoppineedi) వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ మేక (SrikanthMeka) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ (VaralakshmiSarathKumar) ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్ (RahulVijay), శివాని రాజశేఖర్ (ShivaniRajasekhar) కీలక పాత్రలు పోషిస్తున్నారు.

kotabommalips7.jpg

ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు మేకర్స్. ఇందులోని మొదటి పాట 'లింగి లింగి లింగిడి' అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు 'రేలారే' ఫేమ్ పి రఘు సాహిత్యం అందించడంతో పాటు స్వయంగా పాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ముకుందన్ ఈ పాటకు సంగీతం అందించగా, విజయ్ పోలకి కొరియోగ్రఫీ అందించారు.

ఒక పెళ్లి సెట్లో రాహుల్ విజయ్, శివానితో కలిసి శ్రీకాంత్ చేసిన సింపుల్ డాన్స్ మూమెంట్స్ అందర్నీ ఆకట్టుకోవటమే కాకుండా, ఈ పాట వైరల్ అయింది కూడా. ఈ పాటకి వాళ్ళు చేసిన ఆ డాన్స్ రీల్స్ చేస్తూ సాంఘీక మాధ్యమంలో పెడుతూ ఉండటం ఆసక్తికరం. అలాగే ఈ పాటని ప్రముఖ కథానాయకురాలు శ్రీలీల (Sreeleela) విడుదల చేశారు. 'జోహార్', 'అర్జున ఫాల్గుణ' వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని (TejaMarni) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Updated Date - 2023-09-13T12:11:18+05:30 IST