Mega 156: మెగాస్టార్ చిరంజీవి.. ఫ్యాంటసీ సినిమా మొద‌లైంది

ABN , First Publish Date - 2023-11-22T23:22:47+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ట మల్లిడి కాంబినేషన్లో భారీ బడ్జెట్‌తో యు.వి క్రియేషన్స్ నిర్మిస్తున్న మెగా 156 చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. మొద‌టి షెడ్యూల్ తాజాగా బుధ‌వారం మొద‌లవ‌గా కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ చిత్రీక‌ర‌ణ చేసిన‌ట్టు మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.

Mega 156: మెగాస్టార్ చిరంజీవి.. ఫ్యాంటసీ సినిమా మొద‌లైంది
chiru 156

మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi), దర్శకుడు వశిష్ట మల్లిడి (Vasishta) కాంబినేషన్లో భారీ బడ్జెట్‌తో యు.వి క్రియేషన్స్ (UV Creations) నిర్మిస్తున్న మెగా 156 #Mega156 చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. ఫ్యాంటసీ జోన‌ర్లో వ‌స్తున్న ఈ సినిమా దసరా రోజు అధికారికంగా ప్రారంభం అవ‌గా షూటింగ్‌ మొద‌టి షెడ్యూల్ తాజాగా బుధ‌వారం మొద‌లవ‌గా కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ చిత్రీక‌ర‌ణ చేసిన‌ట్టు మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వార్త బాగా వైర‌ల్ అవుతున్న‌ది.

సంగీత దర్శకుడు ఎంఎం.కీరవాణి పాట రికార్డింగ్‌తో పనులు మొదలైన ఈ సినిమాకి 'విశ్వంభరస‌ (Viswambhara) అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో ముగ్గురు కథానాయికలు ఉంటారని, అందులో ఒకరు అనుష్క శెట్టి (Anushka Shetty), మిగతా ఇద్దరు బాలీవుడ్ కథానాయికలుగా చెబుతున్నారు. రానా దగ్గుబాటి (Rana Daggubati) విలన్ గా నటిస్తున్నాడనే వార్త‌లు నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్నాయి.


దేవ, మానవ, పాతాళం ఈ మూడు లోకాల్లో ఓ పాప చుట్టూ తిరిగే ఫాంటసీ కథ అని టాక్‌. చిరంజీవికి ఇది 156వ చిత్రం కాగా, యు.వి సంస్థకు 14వ సినిమా. విక్రమ్, వంశీ,  ప్రమోద్ ఈ చిత్రాన్ని అత్యంత బడ్జెట్‌తో నిర్మించనున్నారు, ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవికి హై బడ్జెట్ మూవీ ఇది.

ఛోటా కె నాయుడు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. కీరవాణి (MM Keeravani) సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్లుగా పనిచేస్తున్నారు.

Updated Date - 2023-11-22T23:32:47+05:30 IST