Agent: నా పక్కన రోజుకి ముగ్గురు నలుగురు చొప్పున చనిపోతుంటే మరి నా పరిస్థితి ఎలా ఉంటుంది...

ABN , First Publish Date - 2023-04-17T10:58:38+05:30 IST

'ఏజెంట్' సినిమా ఎందుకు ఆలస్యం అయింది అన్న విషయం దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన విషయాలు వింటే ఎవరయినా షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ అదేమంటే...

Agent: నా పక్కన రోజుకి ముగ్గురు నలుగురు చొప్పున చనిపోతుంటే మరి నా పరిస్థితి ఎలా ఉంటుంది...

అఖిల్ అక్కినేని (Akhil Akkinei) నటించిన, సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వం వహించిన 'ఏజెంట్' (Agent) ఈనెల 28న (AgentOnApril28) విడుదల అవుతోంది. అనిల్ సుంకర (Anil Sunkar) ఈ సినిమాకి నిర్మాత. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చెయ్యడానికి చాలా కాలం పట్టింది. ఏవేవో కథనాలు మీడియాలో వచ్చాయి. అదే విషయం అడిగితే దర్శకుడు సురేందర్ రెడ్డి ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. చాలామందికి ఈరోజు వరకు తెలియదు ఈ సినిమా ఎందుకు ఇంత డిలే అయిందో అని చెపుతూ ఆ ఆలస్యానికి కారణాలు చెపితే అందరూ షాక్ అయ్యారు.

surenderreddy3.jpg

'ఏజెంట్' సినిమా షూటింగ్ బుడాపెస్ట్ (Budapest) లో జరగాల్సి వుంది. అక్కడకి యూనిట్ అందరూ చేరుకున్నారు, ఇంకా షూటింగ్ తరువాయి. కానీ ఇంతలో సురేందర్ రెడ్డి కి కరోనా వచ్చింది. "నేను వారం రోజులపాటు వెంటిలేటర్ మీద వున్నాను. నేను బతుకుతానో లేదో కూడా తెలియదు. అలంటి పరిస్థితులు అక్కడ వున్నాయి. వేరే దేశం, మనవాళ్ళు ఎవరూ వుండరు, మా యూనిట్ వాళ్ళు చాలామంది వెళ్లిపోయారు, నా కుటుంబం హోటల్ లో ఉండిపోయింది. నా పరిష్టితి అయితే అగమ్యగోచరం, అటువంటి పరిష్టితిలో నేను ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను," అని చెప్పుకొచ్చాడు సురేందర్ రెడ్డి.

"నేను హాస్పిటల్ లో వున్నప్పుడు నా పక్కన రోజుకి ముగ్గురు, నలుగురు చనిపోతూ ఉండేవారు. ఇలా ఉంటే మరి నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. తెలిసిన వాళ్ళు ఎవరూ వుండరు, వాళ్ళు ఎటువంటి మందులు ఇస్తున్నారో తెలియదు, అక్కడ మరీ సీరియస్ అయితే తప్ప హాస్పిటల్ లో జాయిన్ చేసుకోరు, నేను ఒక వారం హాస్పిటల్ లో ఉన్నాక, మళ్ళీ హోటల్ లో అదే ట్రీట్ మెంట్ కంటిన్యూ చేసాను. అసలు అటువంటి బాధలు ఎవరికీ కూడా రాకూడదు, నేను నా కుటుంబం ఎటువంటి పరిస్థితుల్లో నుండి బయటపడ్డామో మాకే తెలుసు," అని చెప్పాడు సురేందర్ రెడ్డి.

surenderreddy1.jpg

"నేను కోలుకోవడానికి సరిగ్గా ఆరు నెలలు పట్టింది. ఇండియా వచ్చి ఇక్కడ మళ్ళీ మెడికేషన్ మొదలు పెట్టిన తరువాత మెల్లగా కోలుకున్నాను. అందుకని ఈ సినిమా ఇన్నాళ్లు డిలే అయింది, అంతే కానీ వేరే కారణాలు ఏమీ లేవు," అని చెప్పాడు సురేందర్ రెడ్డి. ఈ సినిమాకి ఇంత డిలే అయినా నమ్మకంతో ఎంతో ఓపిగ్గా ఎదురుచూసిన అఖిల్ ని ప్రశంసించాలి అని కూడా చెప్పాడు.

surenderreddy.jpg

తరువాత షూటింగ్ హైదరాబాద్ చేస్తున్న సమయంలో సురేందర్ రెడ్డి కాలికి దెబ్బ తగిలి మళ్ళీ ఆసుపత్రి పాలయ్యాడు. అది కూడా ఈ సినిమాలో కథానాయకుడు అఖిల్ అక్కినేని ని #AgentOnApril28 కాపాడబోయి తాను కాలుకి దెబ్బ తగిలించుకున్నాడు. అది కూడా షూటింగ్ కి కొంత డిలే అయింది. ఎంత డిలే అయినా ఈ సినిమా బ్రహ్మాండంగా వచ్చిందని నమ్మకంతో వున్నాడు సురేందర్. ఈ సినిమా మొదలయ్యి రెండు సంవత్సరాలు అయినా, కేవలం 102 రోజులు మాత్రమే షూటింగ్ చేశామని చెప్పాడు. సాక్షి వైద్య (Sakshi Vaidya) ఇందులో కథానాయకురాలు కాగా, మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి (Mammootty) ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అలాగే హిందీ నటుడు డినో మోరియా (Dino Morea) కూడా విలన్ గా కనపడతాడు.

-- సురేష్ కవిరాయని

Updated Date - 2023-04-17T10:58:39+05:30 IST