scorecardresearch

VarunLav: కొత్త దంపతుల మొదటి ఫోటోషూట్ వైరల్

ABN , First Publish Date - 2023-11-02T14:06:16+05:30 IST

క్యూట్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు వివాహం అనంతం తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరూ ఎంతో చూడముచ్చటగా వున్నారు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

VarunLav: కొత్త దంపతుల మొదటి ఫోటోషూట్ వైరల్
Cute couple Varun Tej and Lavanya Tripathi

వరుణ్ తేజ్(VarunTej), లావణ్య త్రిపాఠి (LavanyaTripathi) నిన్న ఇటలీలో వివాహం చేసుకొని దంపతులు అయ్యారు. ఇప్పుడు ఈ ఇద్దరినీ టాలీవుడ్ క్యూట్ కపుల్ (VarunLav) అని అంటున్నారు. పెళ్లి అయిన తరువాత చాలా ఫోటోలు విడుదల చేశారు, కానీ అందులో ఆ కొత్త దంపతులు ఇద్దరూ తీసుకున్న ఫోటోలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య ఇద్దరూ ఈ ఫోటోలో ఎంతో చూడ ముచ్చటగా వున్నారు అని నెటిజన్స్ అంటున్నారు. #MegaWedding

varunlav9.jpg

వరుణ్ తేజ్, లావణ్యలది ప్రేమ వివాహం. ఎన్నాళ్ళ నుండో ఇద్దరూ ప్రేమలో వున్నా, బయటవాళ్ళకి ముఖ్యంగా మీడియా వాళ్ళకి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు. కొన్ని నెలల క్రితం ఇండియాలో వరుణ్ తేజ ఇంట్లో వారిద్దరి నిశ్చితార్ధం జరిగింది. నిన్న ఇటలీలో వివాహం జరిగింది.

ఈ వివాహానికి మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి (MegaStarChiranjeevi), అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళతో వున్న ఫోటో కూడా వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసి అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఇన్నాళ్ళకి అందరినీ ఒకే ఫోటోలో చూస్తున్నాం అంటూ సంబరపడుతున్నారు.

varunlav10.jpg

ఇక మెగా నటులు అందరూ వున్న ఫోటో కూడా వైరల్ అవుతోంది. ఇందులో మొత్తం మెగా కుటుంబం నుండి వచ్చిన నటులు అందరూ వున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ (PawanKalyan), నాగబాబు (Nagababu), రామ్ చరణ్ (RamCharan), అల్లు అర్జున్ (AlluArjun), సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej), వైష్ణవ తేజ్ (VaishnavTej), అల్లు శిరీష్ (AlluSirish) తో కొత్త దంపతులు అయిన'

వరుణ్ తేజ్, లావణ్య వున్న ఫోటో కూడా వైరల్ అవుతోంది. ఇలా ఒకేసారి ఇంతమందిని తమ ఇష్టమైన నటుల్ని ఒకేసారి ఫోటోల్లో చూస్తూ మెగా అభిమానులు సాంఘీక మాధ్యమంలో ఈ ఫోటోల గురించి మాట్లాడుకుంటూ ఆనందపడుతున్నారు.

Updated Date - 2023-11-02T14:06:19+05:30 IST