Film Chamber: ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికలకు సిద్ధం!

ABN , First Publish Date - 2023-07-11T14:57:09+05:30 IST

తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 30న ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికలు జరగనున్నాయి. 14వ తేదికి నామినేషన్స్‌ పూర్తి కావాలని, 21కి నామినేషన్‌ విత్‌డ్రాకు ఆఖరు తేదీ అని తెలిసింది

Film Chamber: ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికలకు సిద్ధం!

తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌ (Telugu Film Chamber) ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 30న ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికలు జరగనున్నాయి. 14వ తేదికి నామినేషన్స్‌ పూర్తి కావాలని, 21కి నామినేషన్‌ విత్‌డ్రాకు ఆఖరు తేదీ అని తెలిసింది. సి.కల్యాణ్‌(C Kalyan), దిల్‌ రాజు (Dil raju) అధ్యక్ష పదవికి బరిలో ఉన్నారని టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం కె.బసిరెడ్డి ఛాంబర్‌ అధ్యక్షుడిగా ఉన్నారు.


ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్ష పదవి కోసం చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి. కీలకంగా మాత్రం నిర్మాత సి.కల్యాణ్‌ దిల్‌ రాజు పేర్లు వినిపిస్తున్నాయి. సి.కల్యాణ్‌ ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో శాఖల్లో కీలక పదవుల్లో సేవలందించారు. సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా కూడా ఆయన పని చేశారు. టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్న దిల్‌ రాజు యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అంతా కలిసి ఏర్పాటు చేసుకున్న గిల్డ్‌లో కీలకంగా ఉన్నారు. అయితే వీరిద్దరూ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్ష పదవి కోసం పోటీ పడితే ‘నువ్వా-నేనా’ అన్నట్లు ఎన్నికల వాతావరణం ఉంటుందని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ ఎన్నికలు జరిగినా వర్గాలుగా విడిపోవడం, వివాదాలు, విమర్శలు చూస్తూనే ఉన్నాం. మరి ఈసారి ఎలా జరగబోతున్నాయో చూడాలి.

Updated Date - 2023-07-11T17:20:55+05:30 IST