MalliPelli: నరేష్, పవిత్ర కథని రిజెక్ట్ చేసిన ప్రేక్షకులు

ABN , First Publish Date - 2023-05-29T10:48:42+05:30 IST

నరేష్, పవిత్రల కథ 'మళ్ళీపెళ్లి' సినిమా మూడు రోజుల కిందట విడుదల అయింది. ఈ సినిమాలో కొంచెం వివాదాస్పద కథ కావటం, అలాగే ఈ ప్రచార చిత్రాలు బాగా వైరల్ అవతంతో ఈ సినిమా కలెక్షన్స్ బాగుంటాయి అనుకున్నారు. కానీ నరేష్ రూ. 15 కోట్లు ఖర్చుపెట్టి, తన సొంత కథ చెప్పుకోవడానికి తీసిన ఈ కథని ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు.

MalliPelli: నరేష్, పవిత్ర కథని రిజెక్ట్ చేసిన ప్రేక్షకులు

సీనియర్ నటుడు నరేష్(VKNaresh), పవిత్ర లోకేష్ (PavitraLokesh) నటించిన 'మళ్ళీ పెళ్లి' #MalliPelli గత శుక్రవారం విడుదల అయింది. ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నాడు నరేష్. ఈ సినిమా కథ కూడా నరేష్, పవిత్ర, నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి (RamyaRaghupathi) మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ట్రైలర్, టీజర్ లాంటివి చాలా వైరల్ అయ్యాయి, మిలియన్స్ కొద్దీ వ్యూస్ వచ్చాయి.

Pavitra-lokesh.jpg

అందువల్ల ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అని ఆ చిత్ర టీము భావించింది. చాలా అంచనాలు పెట్టుకుంది కూడా ఈ సినిమా మీద. ప్రముఖ నిర్మాత అయిన ఎంఎస్ రాజు (MSRaju), ఈ చిత్రానికి దర్శకుడుగా పని చేసాడు, అలాగే కథ కూడా ఆయనే ఇచ్చాడు అని అన్నారు. ఈ సినిమాలో రమ్య రఘుపతి పాత్ర వనిత విజయకుమార్ (VanithaVijayKumar) వేసింది.

ఈ సినిమా కథలో కొత్తదనం ఏమీ లేదు. ఎందుకంటే నరేష్, పవిత్ర, రమ్య రఘుపతి #NareshPavitra గత రెండేళ్లలో పబ్లిక్ గా ఒకరిమీద ఒకరు చేసుకున్న ఆరోపణలు, టీవీల్లో మాట్లాడినవి అన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే నరేష్ తన సైడ్ నుండి తనకి, తన మూడో భార్యకి మధ్య ఏమి జరిగింది అనేది చెప్పాడు. #PavitraNaresh అయిదే ఇది వన్ సైడ్ స్టోరీ లా అనిపించింది. అలాగే పవిత్రతో పరిచయం, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇవన్నీ కొంచెం ఆసక్తికరంగా వున్నా, ప్రేక్షకులు ఈ సినిమాని రిజెక్ట్ చేశారు.

pavitra-naresh.jpg

మొదటి రోజు ఈ సినిమా సుమారు 18 లక్షల షేర్ మాత్రమే వసూల్ చేసింది. ఇంకా రెండో రోజు, మూడో రోజు కూడా ఈ సినిమా కలెక్షన్ అంతగా లేదు అనే చెప్తున్నారు ట్రేడ్ అనలిస్ట్స్. మూడు రోజులకు గాని మొత్తం రూ 67 లక్షల గ్రాస్ వసూల్ చేసింది, అంటే ఈ చిత్రానికి షేర్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఇది ఒక డిజాస్టర్ కింద లెక్క అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

నరేష్ ఈ చిత్రానికి సుమారు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టాను అని చెపుతున్నాడు. అలాగే ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు రూ 1.5 కోట్లకు అమ్మారు అని కూడా తెలిసింది. కానీ నరేష్ ఈ సినిమా ఎంతో కలెక్టు చేస్తుంది అనుకున్నాడు కానీ అతని ఆశలు అడియాసలే అయ్యాయి. నరేష్, పవిత్ర ల కథని తెలుగు ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు అని అనలిస్ట్స్ చెపుతున్నారు.

Updated Date - 2023-05-29T10:48:42+05:30 IST