సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

TarakaRatna Wife: బాలయ్యపై భావోద్వేగ పోస్ట్‌!

ABN, First Publish Date - 2023-03-14T17:26:29+05:30

నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) మరణ విషాదం నుంచి ఆయన కుటుంబ సభ్యులు ఇంకా కోలుకోలేదు. భర్త తాలుక మధుర జ్ఞాపకాల్ని తలుచుకుంటూ అలేఖ్యారెడ్డి (alekhya reddy) కుమిలిపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) మరణ విషాదం నుంచి ఆయన కుటుంబ సభ్యులు ఇంకా కోలుకోలేదు. భర్త తాలుక మధుర జ్ఞాపకాల్ని తలుచుకుంటూ అలేఖ్యారెడ్డి (alekhya reddy) కుమిలిపోతున్నారు. ఆయనకు సంబంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రేమికుల రోజున తారకరత్న రాసిన ప్రేమలేఖ, తిరుమలలో కుటుంబ సభ్యులంతా కలిసి దిగిన ఫొటో పంచుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నందమూరి బాలకృష్ణ వారికి తోడుగా ఉండడంతో కాస్త ధైర్యంగా ఉంటున్నారు. తారకరత్న అనారోగ్యానికి గురైనప్పటి నుంచి బాలయ్య దగ్గరుండి అన్ని చూసుకున్నారు. ఆయన్ను బతికించడానికి శాయశక్తుల కృషి చేశారు. తారకరత్న మరణం, తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఆయనే స్వయంగా చూసుకున్నారు. ఆ క్రమంలో కష్టకాలంలో బాలకృష్ణ చేసిన సాయం, మద్దతును తలచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు అలేఖ్య. అభిమానులు తారకరత్న కుటుంబంతోపాటు బాలకృష్ణ ఉన్న ఫొటోను ఎడిట్‌ చేసి పోస్ట్‌ చేసిన ఫొటోను అలేఖ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఇలా రాసుకొచ్చారు.

(Alekhya reddy emotional post) ‘‘మమ్మల్ని కుటుంబంగా భావించే ఏకైక వ్యక్తి, మా మంచి, చెడులలో మాకు అండగా నిలిచే వ్యక్తి. ఓ తండ్రిలా ఆస్పత్రికి తీసుకెళ్లి, తల్లిలా లాలించి, నువ్వు కోలుకోవాలని బలంగా కోరుకున్న మనిషి, నీలో కదలిక రావాలని పక్కనే ఉండి సరదాగా జోకులు వేసి, ఎవరూ చూడనప్పుడు నీ కోసం కన్నీరు పెట్టుకున్న మహానుభావుడు. ఇలా ప్రతి క్షణం మనవెంట ఉన్నారు. ‘జై బాలయ్య.. జై బాలయ్య’ అని బాలకృష్ణను ఉద్దేశించి రాసుకొచ్చారు. (Tarakaratna no more)

‘నువ్వు మాతో ఇంకా ఉండుంటే బావుండేది ఓబు. (బాలకృష్ణ తారకరత్నను ముద్దుగా పిలుచుకునే పేరు). నిన్ను చాలా మిస్‌ అవుతున్నాం. ఎందుకు ఓబు ఇలా వదిలేసి వెళ్లిపోయావ్‌’’ అని ఆవేదన వ్యక్తం చేశారు అలేఖ్యారెడ్డి. తారకరత్న కుటుంబం అంతా కలిసి దిగిన ఫొటోను ఎడిట్‌ చేసిన వారికి అలేఖ్యా కృతజ్ఞతలు చెబుతూ తన పిల్లలతో బాలయ్య దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌ చూసిన అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. బాలకృష్ణ-తారకరత్న అనుబంధంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ధైర్యంగా ఉండండి మేడమ్‌.. బాలయ్య మీ కుటుంబానికి తోడుగా, నీడగా ఉన్నారు. ఆనందంలో ఎవ్వరైనా తోడుంటారు.. కష్టాలు, కన్నీళ్లలో తోడున్న వారే నిజమైన బంధువులు’’ అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-03-14T20:47:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!