సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Taraka Ratna Wife: మన అనుకున్నవాళ్లే బాధించినప్పుడు.. నిస్సహాయంగా ఉండిపోయాను!

ABN, First Publish Date - 2023-03-18T15:57:06+05:30

నందమూరి తారకరత్న(Tarakaratna) మరణించి శనివారానికి నెల రోజులు అవుతోంది. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన 23 రోజులపాటు చికిత్స పొంది గత నెల 18న తుదిశ్వాస విడిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి తారకరత్న(Tarakaratna) మరణించి శనివారానికి నెల రోజులు అవుతోంది. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన 23 రోజులపాటు చికిత్స పొంది గత నెల 18న తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు, అభిమానులు ఆ విషాదం నుంచి ఇంకా బయటికి రాలేదు. తారకరత్న భార్య అలేఖ్యా (Alekhya emotional post) తరచూ ఆయన్ను తలచుకుంటూ భావోద్వేగ పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా బాధాతప్త హృదయంతో మరో పోస్ట్‌ చేశారు.

‘‘మమ్మల్ని నువ్వు విడిచిపెట్టి సరిగ్గా నెల రోజులు అవుతుంది. కానీ నీ జ్ఞాపకాలు మా మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఓ సందర్భంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. స్నేహితులుగా మారాం. డేటింగ్‌ చేశాం. మన బంధం విషయంలో నేను ధైర్యంగా ముందుకు రాకపోయినా ఇద్దరం కొత్త జీవితం ప్రారంభించడానికి ధైర్యంగా ముందడుగు వేశావు. పెళ్లి చేసుకున్నాం... సమస్యలు, గందరగోళాలు ఎదురయ్యాయి, వివక్షకు గురయ్యాం. ఎంతో పోరాటం చేసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లావ్‌. నిష్కమ్మ పుట్టిన తర్వాత జీవితం మొత్తం మారిపోయింది. సంతోషం రెట్టింపు అయింది. కానీ బాధలు అలాగే మిగిలాయి. మనపై చిమ్ముతున్న ద్వేషాన్ని తప్పించుకునేందుకు కళ్లకు గంతలు కట్టుకుని బతికాం. నీ కుటుంబానికి దూరమయ్యావు కాబట్టి మనకంటూ పెద్ద కుటుంబం కావాలని కోరుకున్నావు. 2019లో ఇద్దరు కవలలకు జన్మనివ్వడంతో మన కుటుంబం పెద్దది అయింది. నీ కోరిక నెరవేరింది. చివరి శ్వాస వరకూ ఎంతో కష్టపడ్డావు. నీ హృదయంలో మోస్తున్న బాధను ఎవరూ అర్థం చేసుకోలేదు. కనీసం పట్టించుకోలేదు. మన అనుకున్న వాళ్లే బాధించినప్పుడు అది గుండెకు ఎంతో బరువు అవుతుంది. అలాంటి సమయంలో నేను ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాను. మనకు మొదటి నుంచీ అండగా ఉన్నవారు కూడా మనకు దూరమై చాలాకాలమైంది. నువ్వు మా రియల్‌ హీరో ఓబు. నీతో జర్నీ చిన్నదే కావచ్చు కానీ అద్భుతమైన జర్నీ. శాంతి, చిత్తశుద్ధి ఉన్న చోట మళ్లీ మనం కలుస్తాం. మిస్‌ యు ఓబు’’ అని అలేఖ్య పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. (One month for Taraka ratna Death)

Updated Date - 2023-03-18T16:09:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!