NTR30: ఎన్టీఆర్‌ సర్‌ప్రైజ్‌కు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2023-05-05T15:18:32+05:30 IST

‘ఎన్టీఆర్‌30’లో తారక్‌ (NTR30) పాత్ర గురించి చెప్పకనే చెప్పారు దర్శకుడు కొరటాల శివ(Koratala siva). దీనిని బట్టి తారక్‌ పాత్ర ఎంత బలంగా ఉంటుందో ఊహించవచ్చు.

NTR30: ఎన్టీఆర్‌ సర్‌ప్రైజ్‌కు సర్వం సిద్ధం

‘‘ఈ కథలో మనుషుల కంటే మృగాలే ఉంటాయి...

భయం అంటే ఏంటో తెలియని మృగాలు అవి...

దేవుడంటే భయం ఉండదు.. చావంటే భయం లేదు...

ఆ మృగాలకున్న భయం ఒక్కటే! అదేంటో అందరూ ఊహించే ఉంటారు’’ అని ‘ఎన్టీఆర్‌30’లో తారక్‌ (NTR30) పాత్ర గురించి చెప్పకనే చెప్పారు దర్శకుడు కొరటాల శివ(Koratala siva). దీనిని బట్టి తారక్‌ పాత్ర ఎంత బలంగా ఉంటుందో ఊహించవచ్చు. తాజాగా ఈ చిత్రం యాక్షన్‌ షెడ్యూల్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో పూర్తయింది. తదుపరి షెడ్యూల్‌కు కొరటాల సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ పుట్టినరోజున అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చే పనిలో పడ్డారు దర్శకుడు. ఎన్టీఆర్‌ బర్త్‌డే (Tarak birthday Glimse) సందర్భగా తారక్‌ ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ విడుదల చేస్తారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఫొటో షూట్‌ చేశారట. దాని నుంచే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారని టాక్‌ నడుస్తోంది. ఫస్ట్ లుక్స్ అదోరకం, దాని లెక్కే వేరు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. (First look surprise Ntr30)

ఫస్ట్‌ లుక్‌ను విపరీతంగా ట్రెండ్‌ చేయాలని అభిమానులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు లక్షల్లో లైక్‌లు, రీ ట్వీట్‌లు, కామెంట్లు చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నారు. ఇతర స్టార్‌ హీరోల ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసినప్పటి కంటే భారీ స్పందన రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆ మేరకు సోషల్‌ మీడియాలో వర్క్‌ చేస్తున్నారు. దాంతోపాటు ఈ ఏడాది సీనియర్‌ ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు జరుగుతుండడంతో దానికి సంబంధించి కూడా తారక్‌ ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అదేంటో తెలుసుకోవాలంటే మే 20 వరకూ వేచి చూడాల్సిందే!

ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధా ఆర్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2023-05-05T15:18:32+05:30 IST