Oscar Viewers: మొదటిస్థానంలో తారక్‌... రెండో స్థానంలో చరణ్‌!

ABN , First Publish Date - 2023-03-14T16:10:02+05:30 IST

95వ ఆస్కార్‌ (95th Oscar) వేడుక సోమవారం ఉదయం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే! భారత్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌(RRR), ‘ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ (The Elephant Whisperers) చిత్రాలు అకాడమీ అవార్డు అందుకున్నాయి .

Oscar Viewers: మొదటిస్థానంలో తారక్‌... రెండో స్థానంలో చరణ్‌!

95వ ఆస్కార్‌ (95th Oscar) వేడుక సోమవారం ఉదయం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే! భారత్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌(RRR), ‘ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ (The Elephant Whisperers) చిత్రాలు అకాడమీ అవార్డు అందుకున్నాయి .అట్టహాసంగా జరిగిన ఈ వేడుకను మీడియా, సోషల్‌ మీడియాలో సుమారు 18.7 మిలియన్ల మంది వీక్షించారట. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన ఏబీసీ దీనికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది వీక్షకుల సంఖ్య 12 శాతం పెరిగిందట. అయితే కొన్ని వేడుకలతో పోల్చితే ఈ సంఖ్య తక్కువే అని కూడా పేర్కొంది. గతంలో నేషనల్‌ ఫుట్‌ బాల్‌ లీగ్‌ ‘సూపర్‌ బౌల్‌’ తర్వాత ఎక్కువమంది వీక్షించే కార్యక్రమంగా ఆస్కార్‌కు గుర్తింపు ఉంది. ్టఒకప్పుడు 30 మిలియన్‌ వ్యూవర్స్‌కు ఏమాత్రం తగ్గేది కాదని లెక్కలున్నాయి. అయితే నాలుగేళ్ల క్రితం నుంచి ఈ వేడును వీక్షించేవారి సంఖ్య క్రమంగా తగ్గింది. 2021లో 9.85 మిలియన్‌ వ్యూవర్స్‌కు పడిపోయింది. 2022లో 16.6 మిలియన్ల మంది ఈ అవార్డు వేడుకను వీక్షించారు. Ntr is top one positon in oscar Discussion)

దీనితో ఆస్కార్‌ వేడుకను చూసేవాళ్లు తగ్గిపోతున్నారనే విమర్శలు మొదలయ్యాయి. కారణం ఒక్క సెలబ్రిటీ కూడా ఈ వేడుకను చూడమని అభిమానులకు చెప్పకపోవడం కారణమని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఏడాది ఆస్కార్‌ ఉత్తమ చిత్రాల బరిలో రెండు బిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టిన ‘టాప్‌గన్‌: మావెరిక్‌’, ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ వంటి చిత్రాలున్నాయి. ఆయా చిత్ర బృందాలు కనీసం ప్రచారం కూడా చేయలేదు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 మిలియన్‌ డాలర్లు వసూళ్లు రాబట్టిన ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ ఉత్తమ చిత్రంగా అవార్డుతో సహా ఏడు ఆస్కార్‌ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఆ చిత్ర బృందం కూడా దీనిపై ఎలాంటి జాగ్రత్త తీసుకోలేదు. అయితే ఆస్కార్‌ వేడుక సందర్భంగా సోషల్‌ మీడియా, న్యూస్‌ మీడియాలో అత్యధికంగా డిస్కర్షన్‌ జరిగిన నటుల జాబితాలో ఎన్టీఆర్‌ మొదటిస్థానంలో *Tarak First place) ఉన్నట్లు సోషల్‌మీడియాను విశ్లేషించే నెట్‌బేస్‌ క్విడ్‌ ఆ ప్రకటనలో పేర్కొంది. ఆ తర్వాత స్థానంలో రామ్‌చరణ్‌ (Ram charan in second place) పేరు ఉంది. ఉత్తమ సహనటుడిగా పురస్కారం అందుకున్న ‘ఎవ్రీథింగ్‌’ నటుడు కె హుయ్‌ ఖ్యాన్‌, ఉత్తమ నటుడు బ్రెండన్‌ ఫ్రేజర్‌ (ది వేల్‌), అమెరికన్‌ యాక్టర్‌ పెడ్రో ఫాస్కల్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఎక్కువ సార్లు ప్రస్తావించి, సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న సినిమాగానూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిలిచింది. తదుపరి ‘ది ఎలిఫెంట్‌ ‘విస్పరర్స్‌’, ‘ఆల్‌ కే్ౖవట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌’, ‘అర్జెంటీనియా 1985’, ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ చిత్రాలు ఉన్నాయి. నటీనటుల సంగతికొస్తే.. మిషెల్‌ యో, లేడీ గాగా, ఏంజిలా బస్సెట్‌, ఎలిజిబెత్‌ ఓల్సెన్‌, జైమి లీ జాబితాలో ఉన్నారు.

Updated Date - 2023-03-14T16:51:36+05:30 IST