Suriya: తండ్రితో వివాదం... ముంబైకి మకాం?

ABN , First Publish Date - 2023-03-03T14:01:53+05:30 IST

ఉమ్మడి కుటుంబంలో కలహాలు సహజమే! దాని వల్ల కుటుంబాలు విడిపోయి వేర్వేరుగా ఉండాల్సి పరిస్థితి వస్తుంది. తాజాగా ఇలాంటి పరిస్థితిల్లో ఉన్నారు తమిళ హీరో సూర్య(Tamil hero Suriya).

Suriya: తండ్రితో వివాదం... ముంబైకి మకాం?

ఉమ్మడి కుటుంబంలో కలహాలు సహజమే! దాని వల్ల కుటుంబాలు విడిపోయి వేర్వేరుగా ఉండాల్సి పరిస్థితి వస్తుంది. తాజాగా ఇలాంటి పరిస్థితిల్లో ఉన్నారు తమిళ హీరో సూర్య(Tamil hero Suriya). తన తండ్రి శివకుమార్‌(Shiva kumar)కు, సూర్యకు మాటమాట రావడంతో సూర్య ముంబైలో స్థిరపడ్డారని, అందుకు పలు కారణాలున్నాయని కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తుంది. ఆ వార్తల్ని బలపరిచేలా తమిళ నటుడు బైల్వన్‌ రంగనాథన్‌ పలు వ్యాఖ్యలు చేశారు. తండ్రితో గొడవ పడి సూర్య ఇంటిని వదిలి ముంబైలో సెటిల్‌ అయ్యాడని, అది తన తండ్రికి నచ్చడం లేదని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రంగనాథన్‌ (bayilvan ranganathan) చెప్పుకొచ్చారు. అసలేం జరిగిందంటే...

సూర్య, జ్యోతికలది (Suriya - Jyothika) ప్రేమ వివాహం. ప్రేమ వ్యవహారం గురించి సూర్య తన తండ్రితో చెప్పినప్పుడు ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. జ్యోతిక సినిమాల్లో నటించనంటే పెళ్లికి అంగీకరిస్తానన్నారట. ఆ ఒప్పందంతోనే చివరకు పెళ్లికి అంగీకరించారు శివకుమార్‌. అలా 2006లో సూర్య-జ్యోతిక వివాహబంధంతో ఒకటయ్యారు. పిల్లలు పుట్టాక ఓ ఆరేళ్లు సినిమాలకు దూరమయ్యారు. 2015 నుంచి నటనకు ఆస్కారమున్న పాత్రలు చేయడం ప్రారంభించి ఏడాదికి ఒకట్రెండ్‌ సినిమాలు చేయడం మొదలుపెట్టారు జ్యోతిక. ఇప్పుడు పిల్లలు ఎదిగి స్కూల్‌కి వెళ్తుండటంతో జ్యోతిక మరోసారి నటన వైపు దృష్టి సారిస్తున్నారు. అలాగే 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు కూడా తీస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఆమె సినిమాల్లో నటించడంతో సూర్య తండ్రి శివకుమార్‌ నచ్చడం లేదట. దాంతో తరచూ ఇంట్లో వివాదాలు జరుగుతుండడంతో సూర్య ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకుని ముంబైలో ఇల్లు తీసుకుని అక్కడికి మకాం మార్చారట. ఈ విషయాలన్నీ కోలీవుడ్‌ మీడియాలో చాలాకాలంగా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఈ విషయంలో తమిళ నటుడు బైల్వన్‌ రంగనాథన్‌ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టడంతో మరోసారి వార్తల్లో నిలిచారు సూర్య. శివకుమార్‌ రెండో కుమారుడు హీరో కార్తి తండ్రికే సపోర్ట్‌గా నిలిచారచి బైల్వన్‌ రంగనాథన్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - 2023-03-03T14:03:53+05:30 IST