సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tamannaah: డబ్బింగ్‌ పూర్తి.. ఆ పాత్ర ప్రత్యేకత అదే!

ABN, First Publish Date - 2023-07-22T16:47:57+05:30

మిల్కీబ్యూటీ తమన్నా ‘భోళాశంకర్‌’ చిత్రం డబ్బింగ్‌ పూర్తి చేశారు. ఈ విషయాన్ని డబ్బింగ్‌ స్టూడియోలో ఉన్న ఫొటోను షేర్‌ చేసి దర్శకుడు మెహర్‌ రమేశ్‌ వెల్లడించారు. ‘‘మిల్కీబ్యూటీ తమన్నా ‘భోళా శంకర్‌’ డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేశారు.

మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah) ‘భోళాశంకర్‌’ (Bhola Shankar) చిత్రం డబ్బింగ్‌ పూర్తి చేశారు. ఈ విషయాన్ని డబ్బింగ్‌ స్టూడియోలో ఉన్న ఫొటోను షేర్‌ చేసి దర్శకుడు మెహర్‌ రమేశ్‌ (Meher Ramesh) వెల్లడించారు. ‘‘మిల్కీబ్యూటీ తమన్నా ‘భోళా శంకర్‌’ డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేశారు. చిరంజీవిగారి సరసన ఆమె గ్లామర్‌గా కనిపిస్తూనే చక్కని వినోదాన్ని పంచుతుంది. కీర్తి సురేశ్‌, సుశాంత్‌, బ్రహ్మానందం, హైపర్‌ ఆది, హర్ష ప్రేక్షకులకు చక్కని ఫన్‌ అందిస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్ట్‌ 11న ఈ చిత్రం విడుదల కానుంది’’ అని మెహర్‌ రమేశ్‌ పేర్కొన్నారు.

చిరంజీవి, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రం అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధంతోపాటు మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాంబ్రహ్మం సుంకర నిర్మించారు. చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్‌ నటించారు. మహతి స్వరసాగర్‌ సంగీతంలో ఇటీవల విడుదలైన మూడు పాటలు ఆకట్టుకున్నాయి.

Updated Date - 2023-07-22T16:56:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!