Talasani Srinivasa yadav: కళాతపస్వీ ప్రత్యేక స్థానం... ఆ విషయంలో నిర్ణయం తీసుకోలేదు!

ABN , First Publish Date - 2023-02-03T10:50:17+05:30 IST

కళాతపస్వీ కె.విశ్వనాథ్‌ (K Viswanath passes away)మరణవార్త తనని ఎంతో కలచివేసిందని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ (talasani Srinivasa yadav condolence to K Viswanath) ( K Viswanath is no more) అన్నారు.

Talasani Srinivasa yadav: కళాతపస్వీ ప్రత్యేక స్థానం... ఆ విషయంలో నిర్ణయం తీసుకోలేదు!

కళాతపస్వీ కె.విశ్వనాథ్‌ (K Viswanath passes away)మరణవార్త తనని ఎంతో కలచివేసిందని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ (talasani Srinivasa yadav condolence to K Viswanath) ( K Viswanath is no more) అన్నారు. శుక్రవారం ఉదయం కె.విశ్వనాథ్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అపురూప చిత్రాలను అందించిన ఆయన మరణించడం చాలా బాధాకరం అని అన్నారు.

తలసాని శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ ‘‘విశ్వనాథ్‌గారు తీసిన చిత్రాల ద్వారా సమాజానికి చక్కని సందేశం అందించారు. ఆయన సినిమాలు చాలా మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయి. ఇండస్ర్టీలో ఎన్నో జానర్ల సినిమాలొచ్చాయి కానీ.. విశ్వనాథ్‌గారు తీసిన సినిమాలు ప్రత్యేకం. మన సంస్కృతి, సంప్రదాయాలపై ఆయనకు మంచి పట్టుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనది ప్రత్యేక స్థానం. ఆయన లేని లోటు తీరనిది. అంత్యక్రియలు... అధికార లాంఛనాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని అన్నారు.

Updated Date - 2023-02-03T10:50:51+05:30 IST