Yatra 2 : అతన్ని ఓడించలేకపోతే.. చేయాల్సింది అదే!

ABN , First Publish Date - 2023-11-07T10:58:58+05:30 IST

ఎన్నికల వస్తున్న తరుణంలో రాజకీయ నేపథ్యమున్న చిత్రాల సందడి మొదలైంది. అలా వస్తున్న చిత్రాల్లో 'యాత్ర-2' (yatra 2) ఒకటి. మహి.వి.రాఘవ దర్శకత్వం వహించిన 'యాత్ర' చిత్రానికి ఇది కొనసాగింపు. తొలి భాగాన్ని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించారు.

Yatra 2 : అతన్ని ఓడించలేకపోతే.. చేయాల్సింది అదే!

ఎన్నికల వస్తున్న తరుణంలో రాజకీయ నేపథ్యమున్న చిత్రాల సందడి మొదలైంది. అలా వస్తున్న చిత్రాల్లో 'యాత్ర-2' (yatra 2) ఒకటి. మహి.వి.రాఘవ దర్శకత్వం వహించిన 'యాత్ర' చిత్రానికి ఇది కొనసాగింపు. తొలి భాగాన్ని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న 'యాత్ర -2'లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. త్రీ ఆటమ్‌ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్‌ సంస్థతో కలిసి శివ మేక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (Suzanne Bernert)

తండ్రి మరణం తర్వాత జగన నాయకుడిగా ఎదిగిన తీరును ఈ చిత్రంలో చూపించనున్నారు. ‘యాత్ర’లో వైయస్సార్‌ పాత్ర పోషించిన మమ్ముట్టి.. ‘ (mamootty) యాత్ర 2’లో కూడా కనిపించనున్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో హిందీ మరాఠీ దర్శకుడు, నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ నటిస్తున్నారు. వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తెలుగు గడ్డపై జరిగిన రాజకీయాల్లో కాంగ్రెస్‌ అగ్ర నేత సోనియా గాంధీ పేరు బలంగా వినిపించింది. అందుకే ‘యాత్ర 2’లో ఆమె పాత్రను జోడించారు. ఆ పాత్రకు జర్మన్‌ నటి సుజానే బెర్నెర్ట్‌ని (ఎంపిక చేశారు. ఇప్పటికే ఆమెపై కొంత షూటింగ్‌ కూడా జరిగింది. మంగళవారం ఆమె ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. 'మీరు అతన్ని ఓడించలేకపోతే.. అతన్ని నాశనం చేయండి’ అనే ట్యాగ్‌లైనను జోడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ వైరల్‌ అవుతోంది.

ఇంతకీ సుజానే బెర్నెర్ట్‌ ఎవరంటే బాలీవుడ్‌ నటుడు, దివంగత అఖిల్‌ మిశ్రా భార్య ఈమె. సుమారు 20 ఏళ్ళగా ఇండియన సినిమాలో భాగమైంది. ిసినిమాలు, వెబ్‌ సిరీస్‌, సీరియళ్లు చేస్తు బిజీగా ఉంది. తెలుగులో ఆమెకిది తొలి అవకాశం. మహి వి. రాఘవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేయన్నారు. యాత్ర చిత్రాన్ని కూడా 2019లో ఇదే తేదీన విడుదల చేశారు.

Updated Date - 2023-11-07T10:58:59+05:30 IST