సస్పెన్స్‌ థ్రిల్లర్‌

ABN , First Publish Date - 2023-07-14T23:04:46+05:30 IST

తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మిస్టరీ’. స్వప్న చౌదరి హీరోయిన్‌. అలీ, సుమన్‌, తనికెళ్ల భరణి ముఖ్య తారాగణం.....

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మిస్టరీ’. స్వప్న చౌదరి హీరోయిన్‌. అలీ, సుమన్‌, తనికెళ్ల భరణి ముఖ్య తారాగణం. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో వెంకట్‌ పులగం నిర్మిస్తున్నారు. యాబై శాతం చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా శుక్రవారం చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘సస్పెన్స్‌, థ్రిల్‌, కామెడీ అంశాలతో సినిమా రూపొందుతోంది. ఈ నెలాఖరుకి షూటింగ్‌ పూర్తవుతుంది. సెప్టెంబర్‌లో విడుదల చేస్తాం’ అన్నారు. కొత్తదనమున్న కథతో సినిమాను తెరకెక్కిస్తున్నామని నిర్మాత తెలిపారు.

Updated Date - 2023-07-14T23:04:46+05:30 IST