Suriya: రీ రిలీజ్‌లోనూ అదే సందడి!

ABN , First Publish Date - 2023-08-04T17:44:40+05:30 IST

కోలీవుడ్‌ స్టార్‌ హీరో (suriya) సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ (Surya son of krishnan) థియేటర్‌లలో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలై 15 ఏళ్లు పూర్తయింది. డిజిటలైజ్‌ చేసిన ఈ చిత్రాన్ని శుక్రవారం రీ రిలీజ్‌ (Re release) చేశారు.

Suriya: రీ రిలీజ్‌లోనూ అదే సందడి!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో (suriya) సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ (Surya son of krishnan) థియేటర్‌లలో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలై 15 ఏళ్లు పూర్తయింది. డిజిటలైజ్‌ చేసిన ఈ చిత్రాన్ని శుక్రవారం రీ రిలీజ్‌ (Re release) చేశారు. తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం థియేటర్‌లలో సందడి చేస్తోంది. 15 ఏళ్ల తర్వాత విడుదలైన ప్రేక్షకులు అదే ఆదరణ చూపిస్తున్నారు. (goutham menen)

సూర్య ద్విపాత్రాభినయంలో నటించిన ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ ఇది. సిమ్రన్‌, సమీరారెడ్డి, దివ్యా శ్రీపాద కథానాయికలుగా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2008లో విడుదలై మంచి టాక్‌ అందుకుంది. తండ్రీ, కొడుకులుగా సూర్య నటన, హరీశ్‌ జయరాజ్‌ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలైన థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. ఆ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - 2023-08-04T17:47:08+05:30 IST