RanaNaidu: ఈ వెబ్ సిరీస్ ని చూడనన్న రాణా తండ్రి

ABN , First Publish Date - 2023-03-11T13:39:37+05:30 IST

దగ్గుబాటి వెంకటేష్, రాణా లు నటించిన వెబ్ సిరీస్ 'రాణా నాయుడు' నిన్న నెట్ ఫ్లిక్ లో విడుదల అయింది. దీని మీద స్పందన మాత్రం మిశ్రమంగా వుంది. వెంకటేష్ ముందే అందరికీ చెప్పాడు, కుటుంబంతో చూడొద్దు, చిన్న పిల్లలు కూడా చూడొద్దు అని. అయినా...

RanaNaidu: ఈ వెబ్ సిరీస్ ని చూడనన్న రాణా తండ్రి

సీనియర్ నటుడు, స్టార్ దగ్గుబాటి వెంకటేష్ (Daggubati Venkatesh), అతని అన్న కుమారుడు నటుడు అయిన రాణా (Rana Daggubati) తో ఒక వెబ్ సిరీస్ 'రాణా నాయుడు' (RanaNaidu) చేశారు. ఇది ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ (Netflix) లో విడుదల అయింది. కానీ దీని మీద అప్పుడే కొంచెం నెగటివ్ కామెంట్స్ రావటం మొదలయింది. ఎందుకంటే ఇందులో శృతి మించి శృంగారం వుంది అని, అలాగే బూతు మాటలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయని అంటున్నారు. మరి వెంకటేష్ అన్నయ్య, రాణా తండ్రి అయిన సురేష్ బాబు (Suresh Babu) ఈ వెబ్ సిరీస్ చూసారా?

rananaidu1.jpg

అంటే లేదు అనే సమాధానం వస్తోంది. ఎందుకంటే సురేష్ బాబు కి ముందే తెలుసు అనుకుంటా ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతోందో? అందుకని అతని చూడలేదు, చూడను అని కూడా చెపుతున్నారు. ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు సురేష్ బాబు.

అలాగే వెంకటేష్ కి నటుడుగా తెలుగు లో చాలా మంచి పేరుంది. అలాగే అతని సినిమాలు అన్నీ కుటుంబ సమేతంగా చూసేవిగా ఇప్పటివరకు (#RanaNaiduWebSeries) వున్నాయి. శోభను బాబు (SobhanBabu) తరువాత అంతటి ఫిమేల్ ప్రేక్షకులు వెంకటేష్ కి వున్నారు, అలంటి వెంకటేష్ ఏంటి, ఇలాంటి వెబ్ సిరీస్ లో నటించటం ఏంటి? అని అందరూ సాంఘీక మాధ్యమాల్లో అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ హిందీ తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ విడుదల అయింది.

rananaidu2.jpg

ఈ వెబ్ సిరీస్ నిన్న నెట్ ఫ్లిక్స్ (NetFlix) లో విడుదల అయ్యే సమయానికి, రామానాయుడు స్టూడియో బిల్ బోర్డు 'రానా నాయుడు' (RanaNaidu) అయింది కాస్తా. ఇదే విషయం సురేష్ బాబు ని అడిగితే, ఇక నుండి ఆ బిల్ బోర్డు అలాగే మారుతుంది అని చెప్పారు. ఆ కుటుంబంలోని నటుల సినిమాలు విడుదల అయినప్పుడు అక్కడ ఆ సినిమా టైటిల్ వస్తుంది అని చెప్తున్నారు. ఉదాహరణకు అభిరాం (Daggubati Abhiram) సినిమా 'అహింస' (Ahimsa) విడుదల అయితే అక్కడ 'అహింస' పేరు వస్తుందిట. అలాగే వెంకటేష్ సినిమా 'సైన్ధవా' (Saindava) విడుదల అయితే ఆ పేరు కూడా అక్కడ వస్తుందిట. ఆలా మారుతూ ఉంటుందిట.

Updated Date - 2023-03-11T13:40:11+05:30 IST