Adipurush : సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చాక.. విచారణలేంటి?

ABN , First Publish Date - 2023-10-09T20:57:34+05:30 IST

ప్రభాస్‌ శ్రీరాముడిగా ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ుఆదిపురుష్‌ చిత్రం విడుదలకు ముందు, తర్వాత ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందనీ, రామాయణంలో పాత్రలను వక్రీకరించారని కొందరు కేసులు పెట్టారు.

Adipurush : సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చాక.. విచారణలేంటి?

ప్రభాస్‌ (Prabhas) శ్రీరాముడిగా ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన "ఆదిపురుష్‌ చిత్రం విడుదలకు ముందు, తర్వాత ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందనీ, రామాయణంలో పాత్రలను వక్రీకరించారని కొందరు కేసులు పెట్టారు. తాజాగా వాటన్నింటినీ కొట్టేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. రామాయణం ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు మతానికి సంబంధించిన కొందరి మనోభావాలు దెబ్బ తీేసలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. పాత్రల పేర్ల విషయంలో కూడా పలువురు విమర్శించారు. హనుమంతుడి సంభాషణల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ చిత్ర నిర్మాతపై కేసులు పెట్టారు. ఈ చిత్రంపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చాక.. ఏ విషయంలోనూ విచారణలు అవసరం లేదు. వీటికి ముగింపు పలకండి’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై వివిధ కోర్టులో జరుగుతున్న వాదనలు అన్ని వ్యర్థమైనవని కోర్టు పేర్కొంది. ఈ వివాదంపై జరుగుతున్న విచారణలన్నీ అనవసరమైనవని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ సోమవారం వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-10-09T20:57:34+05:30 IST