Ghattamaneni Family: మహేష్‌ బాబు రాలేక పోయారు

ABN , First Publish Date - 2023-08-05T17:47:38+05:30 IST

సూపర్‌స్టార్‌కృష్ణ విగ్రహ ఆవిష్కరణ శనివారం ఆయన స్వగ్రామం బుర్రిపాలెంలో జరిగింది. అక్కడ గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆవిష్కరించారు. హీరో సుదీర్‌ బాబు, కృష్ణ కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని, జయ, రమేశ్‌ బాబు భార్య మృదుల, నన్నపనేని రాజకుమారి, నిర్మాతలు అచ్చిరెడ్డి, శాఖమూరి మల్లికార్జునరావు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.

Ghattamaneni Family: మహేష్‌ బాబు రాలేక పోయారు

సూపర్‌స్టార్‌కృష్ణ విగ్రహ ఆవిష్కరణ శనివారం ఆయన స్వగ్రామం బుర్రిపాలెంలో జరిగింది. అక్కడ గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆవిష్కరించారు. హీరో సుదీర్‌ బాబు, కృష్ణ కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని, జయ, రమేశ్‌ బాబు భార్య మృదుల, నన్నపనేని రాజకుమారి, నిర్మాతలు అచ్చిరెడ్డి, శాఖమూరి మల్లికార్జునరావు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌ వినాయకరావు రచించిన ‘దేవుడి లాంటి మనిషి’ పుస్తకాన్ని సుధీర్‌బాబు ఆవిష్కరించి ఆదిశేషగిరిరావుకు తొలి కాపీ అందించారు.

నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ‘‘అన్నయ్య బుర్రిపాలెం పేరు ఎత్తకుండా ఎప్పుడూ మాట్లాడరు. గ్రామంలో ఎన్నో అభివృద్థి కార్యక్రమాలు చేశారు ఇక ముందు కూడా కొనసాగిస్తాము. గ్రామానికి ఏం కావాలన్నా మా దృష్టికి తీసుకువస్తే కుటుంబం తరుపున చేస్తాం. కుటుంబ సభ్యులందరం కలిసి కృష్ణ గారి జ్ఞాపకాలు గ్రామంలో పదిలంగా నిలుపుతాం. బుర్రిపాలెం గ్రామంలో అన్నయ్య విగ్రహం ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. సీనియర్‌ జర్నలిస్ట్‌ వినాయకరావు గారు మూడేళ్ల పాటు శ్రమించి అద్భుతమైన సమాచారంతో ‘దేవుడి లాంటి మనిషి’ పుస్తకం రాశారు. చరిత్రకు అద్దం పట్టే ఇలాంటి పుస్తకాల అవసరం ఎంత్తైనా ఉంది. కృష్ణ పేరు గుర్తుండేలా రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేపడతాం. మహేష్‌ బాబు ఇప్పుడు రాలేక పోయారు. మరోసారి వస్తానన్నాడు’’ అన్నారు.

1.jpg

సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘‘కృష్ణ గారిలా నేను కూడా సినిమాను ఇష్టపడి ఈ రంగంలోకి వచ్చి ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నా. మావయ్యగారి విగ్రహ ఆవిష్కరణ చేయడం, అలాగే వినాయకరావుగారు రాసిన ఈ అద్భుతమైన పుస్తకం నా చేతుల మీదుగా విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు.

పుస్తక రచయిత వినాయకరావు మాట్లాడుతూ ‘‘కృష్ణగారి కోరిక మీదే ఈ పుస్తకాన్ని అదనపు హంగులతో రెండో సారి తీసుకువచ్చాను. ఈ పుస్తకాన్ని చూడకుండానే ఆయన మనకు దూరం కావడం బాధాకరం’’ అని అన్నారు.

‘‘నాన్నకు పుట్టిన ఊరిపై చాలా ప్రేమ. ప్రతిసారి బుర్రిపాలెం గ్రామంలో చిన్ననాటి జ్ఞాపకాలను తమతో నెమర వేసుకుంటూ ఉండేవారు. ఆయన ఆశయాలను సాధించేలా ముందుకు వెళ్తాం’’ అని గల్లా పద్మావతి అన్నారు.

3.jpg

Updated Date - 2023-08-05T17:49:34+05:30 IST