Chakravyuham: ఆకట్టుకుంటోన్న మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ పోస్టర్

ABN , First Publish Date - 2023-01-02T18:45:28+05:30 IST

సహస్ర క్రియేషన్స్ (Sahasra Creations) బ్యానర్‌పై నిర్మాత శ్రీమతి. సావిత్రి (Smt. Savitri) నిర్మిస్తున్న చిత్రం ‘చక్రవ్యూహం’ (Chakravyuham). ది ట్రాప్ అనేది ఉపశీర్షిక. విలక్షణ పాత్రలతో

Chakravyuham: ఆకట్టుకుంటోన్న మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ పోస్టర్
Super Star Krishna Launches Chakravyuham

సహస్ర క్రియేషన్స్ (Sahasra Creations) బ్యానర్‌పై నిర్మాత శ్రీమతి. సావిత్రి (Smt. Savitri) నిర్మిస్తున్న చిత్రం ‘చక్రవ్యూహం’ (Chakravyuham). ది ట్రాప్ అనేది ఉపశీర్షిక. విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అజయ్ (Ajay) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చెట్కూరి మధుసూధన్ (Chetkuri Madhusudhan) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు సినిమా స్థాయిని పెంచిన స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) ఇటీవల విడుదల చేశారు. తెలుగు తెరపై ఆయనే తొలి కౌబోయ్, ఆయనే మొదటి జేమ్స్ బాండ్, ఆయనే ఫస్ట్ సినిమా స్కోప్ హీరో, ఆయనే ప్రథమ 70 ఎం. ఎం. మూవీ డైరెక్టర్ కమ్ హీరో… చిత్రసీమలో డేరింగ్ డాషింగ్ అనే పదాలకు నిలువెత్తు నిర్వచనంగా మారి, తెలుగు చిత్రపరిశ్రమకు ఒక సరికొత్త టెక్నలాజినీ పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదలైన ఈ పోస్టర్.. ట్రెమండస్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది.

Ajay-Pic.jpg

సూపర్ స్టార్ కృష్ణ ఆశీస్సులు అందుకున్న ఈ చిత్రం.. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ప్రేక్షకులతో మంచి స్పందనను రాబట్టుకోవడం విశేషం. ఈ పోస్టర్‌లో పోలీస్‌గా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న అజయ్‌ను గమనించవచ్చు. ఈ సినిమా మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ (Murder Mystery Crime Thriller)గా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. వెంకటేష్, అనూష సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు భరత్ మంచిరాజు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్రబృందం తెలియజేసింది. (Chakravyuham First Look)

Updated Date - 2023-01-02T18:45:29+05:30 IST