సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Singer Sunitha: తల్లీ - కొడుకుల కల నెరవేరిన రోజు

ABN, First Publish Date - 2023-07-01T16:45:43+05:30

గాయని సునీత కుమారుడు ఆకాశ్‌ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఆకాశ్‌ హీరోగా చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగమోని శేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనయుడిని ఉద్దేశిస్తూ సునీత సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాయని సునీత (Singer Sunitha) కుమారుడు ఆకాశ్‌ (Akash) హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఆకాశ్‌ హీరోగా చిత్రం ‘సర్కారు నౌకరి’(SarkaruNaukari). గంగమోని శేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్‌.కె టెలీ షో ప్రై.లి పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తనయుడిని ఉద్దేశిస్తూ సునీత సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

‘‘కంగ్రాట్స్‌ ఆకాశ్‌.. ఒక తల్లీ కుమారుడి కల నెరవేరిన రోజు ఇది. ప్రపంచంతో నువ్వు పంచుకోనున్న కథను తెలియజేయడంతోపాటు నటుడు కావాలనే నీ కలను సాకారం చేసుకోవడం కోసం నువ్వు పడిన కష్టం, లెక్కలేనని గంటల శ్రమ, వృతి పట్ల నీకున్న నిబద్థత, ఎన్నో విషయాల్లో నువ్వు చేసిన త్యాగాలకు ఈ పోస్టర్‌ అద్దం పడుతోంది. సినిమా పట్ల నీకున్న ఇష్టాన్ని ఈ ప్రపంచం త్వరలోనే చూడనుంది. ఈ రోజు, ప్రతి రోజు నీకు బెస్ట్‌గానే ఉండాలని కోరుకుంటున్నా’’ అని సునీత ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

Updated Date - 2023-07-01T16:45:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!